వైసీపీలో ప్ర‌క్షాళ‌న ఉన్న‌ట్టా... లేన‌ట్టా..?

ప్ర‌స్తుతం వైసీపీకి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలోనే కాకుండా.. మండ‌లాలు, గ్రామ స్థాయిలోనూ నాయ‌కులు ఉన్నారు. పార్టీని లీడ్ చేస్తున్నారు.

Update: 2024-07-07 04:07 GMT

వైసీపీలో ప్ర‌క్షాళ‌న ఉన్న‌ట్టా? లేన‌ట్టా? పార్టీ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తున్న ప్ర‌శ్న ఇదే. ఎన్నిక‌ల్లో ఘోర ప రాజ‌యం త‌ర్వాత‌.. పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారింది. దీనిని స‌రిదిద్దాలంటే.. బ‌ల‌మైన నాయ‌కుల అవ‌స‌రం ఎంతైనా ఉంది. ముఖ్యంగా.. పార్టీ త‌ర‌ఫున నిర్మాణాత్మ‌కంగా మాట్లాడే నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను క‌లుపుకొని పోయే నాయ‌కుల అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంలో పార్టీ చాలా ముందు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పొర‌పాట్లు వేరు. ఇక‌, ముందు మాత్రం అడుగులు ఒద్దిక‌గా.. ప‌డాలి.

ప్ర‌స్తుతం వైసీపీకి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలోనే కాకుండా.. మండ‌లాలు, గ్రామ స్థాయిలోనూ నాయ‌కులు ఉన్నారు. పార్టీని లీడ్ చేస్తున్నారు. అయితే.. వీరి కార‌ణంగానే పార్టీ ఓడింద‌న్న స‌మాచారం నెమ్మ‌దిగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. కొంద‌రు పార్టీ నాయ‌కులు.. కూట‌మి పార్టీల‌తో కుమ్మ‌క్క‌య్యార‌న్న స‌మ చారం కూడా ఉంది. ఇదేస‌మ‌యంలో పార్టీ ఇచ్చిన నిధుల‌ను కూడా స‌క్ర‌మంగా ఖ‌ర్చు చేయ‌కుండా.. మ‌రికొంద‌రు సొంత అవ‌స‌రాల‌కు మ‌ళ్లించార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి.

సో.. ఎలా చూసుకున్నా.. ఇప్పుడు పార్టీని డెవ‌ల‌ప్ చేయాలంటే.. నాయ‌కుల‌ను లైన్‌లో పెట్టాల్సిన అవ‌స రం ఉంది. ఇదేస‌మ‌యంలో మార్పు దిశ‌గా అడుగులు వేయాల్సి ఉంది. ఈ రెండు కీల‌క అంశాల‌పై పార్టీ అధినేత దృష్టి పెట్టాలని చాలా మంది నాయ‌కులు కోరుతున్నారు. అదేస‌మ‌యంలో అధిష్టానం వ‌ద్ద కూడా.. పార్టీ నాయ‌కుల‌కు ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్‌కు అవ‌కాశం క‌ల్పించాల‌న్న డిమాండ్ కొన్నా ళ్లుగా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

ఎలానూ పార్టీ ఘోర ప‌రాజ‌యం పొందిన ద‌రిమిలా.. ఇప్పుడు ప్ర‌క్షాళ‌న దిశ‌గా అడుగులు వేసి.. చెత్త‌ను ఏరేయాల‌న్న‌ది సీనియ‌ర్ల‌ల మాట‌. ముఖ్యంగా ప్ర‌ధాన కార్యాల‌యంలోనే ఎక్కువ‌గా మార్పులు చేయాల‌ని నాయ‌కులు కోరుతున్నారు. ఈ విష‌యంలో ఎంత తొంద‌ర‌గా నిర్ణ‌యం తీసుకుంటే అంత మంచిద‌ని కూడా చెబుతున్నారు. లేక‌పోతే.. క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ క‌కావిక‌లం అయ్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని చెబుతున్నారు. ముందుగా పెద్ద త‌ల‌కాయ‌ల్లోనే మార్పు రావాల్సి ఉంద‌ని కోరుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News