"పుష్ప"లో చంద్రబాబు... పేలుతున్న వైసీపీ సెటైర్లు!
ఈ సందర్భంగా స్పందించిన బాబు... "పుష్ప సినిమాలో నేను ఉన్నానని, నా ఫోటోని కొన్ని సన్నివేశాల్లో చూపించారని వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు.
"పుష్ప" సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఇప్పుడు అవార్డు రావడంతో... ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ జనాలతో పాటు రాజకీయ నాయకులు, వివిద వర్గాల వారూ ప్రస్తుతం బన్నీని అభినందించే పనిలో ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఎంటరయ్యారు.
అవును... జాతీయ అవార్డు వచ్చినందుకు అల్లు అర్జున్ ని అభినందించిన చంద్రబాబు... ఈ గ్యాప్ లో తన గురించి కూడా కాస్త బలంగానే చెప్పుకున్నారు. ‘పుష్ప’ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు రావడానికి తాను కారణం అని చెప్పలేదు కానీ... ఆ సినిమాలో కొన్ని చోట్ల తన ఫోటో ఉండటంపై వైసీపీ నాయకులు ఏడుస్తున్నారని చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన బాబు... "పుష్ప సినిమాలో నేను ఉన్నానని, నా ఫోటోని కొన్ని సన్నివేశాల్లో చూపించారని వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు. సినిమాలోని కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ లో నా ఫోటో ఉంటుంది. సినిమాలోని కొన్ని సీన్స్ బ్యాక్ గ్రౌండ్ లో నా ఫోటో ఉంటుంది. మూవీలో చూపించిన టైంలో నేను సీఎంగా ఉన్నానని ఆ ఫోటో పెట్టారా..? లేక, ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్ చేశానని నా ఫోటో పెట్టారో తెలియదు" అని చెప్పుకున్నారు.
బాబు వెర్షన్ అలా ఉంటే... ఈ విషయంపై వైసీపీ నేతలు తమదైన స్థాయిలో సెటైర్లు పేలుస్తున్నారు. లాజిక్ గా కౌంటర్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా... ఈ చిత్రంలో పోలీసు స్టేషన్, అలాగే సరిహద్దు చెక్ పోస్ట్ లో రెండు సీన్లలో ఆయన ఫోటో ఉంటుంది. ఈ రెండూ కూడా ప్రభుత్వ కార్యాలయాలే కాబట్టి.. సీఎం ఫోటో ఉండడం వింత కాదు. అని క్లారిటీ ఇస్తున్నారు.
అయితే తాను సీఎం గా ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లను కంట్రోల్ చేసినట్లు చెప్పుకోవడంపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. ఆ సినిమా స్మగ్లింగ్ ని నిరోధించిన అధికారులకు సంబంధించిన ఫోటో కాదని.. విచ్చలవిడిగా ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందనే విషయం అని స్పష్టం చేస్తున్నారు.