బోలెడు ట్విస్టులిస్తూ వైసీపీ రెండవ జాబితా రిలీజ్...!

ఎంతో ఉత్కంఠ మధ్యన వైసీపీ రెండవ జాబితా రిలీజ్ అయింది. ఈ జాబితలో బోలెడు ట్విస్టులు ఉండడం విశేఅషం. కొందరిని షిఫ్ట్ చేశారు. కొందరిని ఎంపీ ప్లేస్ నుంచి ఎమ్మెల్యే ప్లేస్ లోకి తెచ్చారు.

Update: 2024-01-02 16:23 GMT

ఎంతో ఉత్కంఠ మధ్యన వైసీపీ రెండవ జాబితా రిలీజ్ అయింది. ఈ జాబితలో బోలెడు ట్విస్టులు ఉండడం విశేషం. కొందరిని షిఫ్ట్ చేశారు. కొందరిని ఎంపీ ప్లేస్ నుంచి ఎమ్మెల్యే ప్లేస్ లోకి తెచ్చారు. మరికొందరిని పక్కన పెట్టారు. ఈ జాబితా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొత్తం ఇరవై ఏడు మందితో ఈ జాబితాను రూపొందించారు. దాన్ని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు. ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ పూర్తి కసరత్తు చేసిన మీదట జగన్ ఈ జాబితాకు ఆమోదముద్ర వేశారు.

ఈ జాబితాలో పార్లమెంట్ నియోజకవర్గాలకు అసెంబ్లీ సీట్లకు ఇంచార్జిలను నియమించారు. అనంతపురం ఎంపీ సీటుకు మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంప్సీ సీటుకు జొలదరాశి శాంత అరకు ఎంపీ సీటుకు కె భాగ్యలక్ష్మి ఇంచార్జిలుగా నియమితులయ్యారు.

రాజాం అసెంబ్లీకి డాక్టర్ తాళె రాజేష్, అనకాపల్లికి మలసాల భరత్ కుమార్, పాయకరావుపేటకు కంబాల జోగులు, రామచంద్రాపురం కి పిల్లి సూర్య ప్రకాష్, పి గన్నవరం కి విప్పర్తి వేణుగోపాల్, పిఠాపుప్రం వంగా గీత, జగ్గయ్య పేట తోట నరసింహం, ప్రత్తిపాడు పరువుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి బీఎస్ మక్సూల్ అహ్మద్, ఎర్రగొండిపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, గుంటూరు ఈస్ట్ షేక్ నూరీ ఫాతిమా, మచిలీపట్నం పేర్ని క్రిష్ణమూర్తి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుగొండ కేవీ ఉషశ్రీ చరణ్, కళ్యాణ దుర్గం తలారి రంగయ్య, అరకు గొడ్డెటి మాధవి, పాడేరు, మత్స్యరాస విశ్వేశ్వర రాజు, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ షేక్ అసిఫ్ లను నియమించారు.



Tags:    

Similar News