చంద్రబాబు కేబినెట్ లో అతి పిన్న, పెద్ద వయస్కులు వీరే!

అయితే వీరిలో అతి పిన్న, పెద్ద వయస్కుల వారు ఎవరు అనేది ఆసక్తిక్గా మారింది. ఇందులో భాగంగా... చంద్రబాబు కొత్త కేబినెట్ లో వంగలపూడి అనిత.. అతి పిన్న వయసున్న మంత్రిగా రికార్డు కెక్కారు.

Update: 2024-06-12 12:12 GMT

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పాలి. ఆన్ లైన్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ కార్యక్రమలో చంద్రబాబుతో పాటు మరో 24మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

అయితే వీరిలో అతి పిన్న, పెద్ద వయస్కుల వారు ఎవరు అనేది ఆసక్తిక్గా మారింది. ఇందులో భాగంగా... చంద్రబాబు కొత్త కేబినెట్ లో వంగలపూడి అనిత.. అతి పిన్న వయసున్న మంత్రిగా రికార్డు కెక్కారు. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచిన అనిత... ఈ రోజు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమె వయసు 40ఏళ్లు.

పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన అనిత... ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇందులో భాగంగా... 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమె... 2018లో టీటీడీ బోర్దు సభ్యురాలిగా నియమితులయ్యారు.

2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత.. తాజా ఎన్నికల్లో మరోసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరోవైపు చంద్రబాబు కేబినెట్ లో 70 ఏళ్లు దాటినవారు ముగ్గురు ఉండగా.. 50 నుంచి 70ఏళ్ల మధ్యలో ఉన్నవారు 15 మంది ఉన్నారు. అదే విధంగా... 40 - 50ఏళ్ల మధ్య వారు కేవలం నలుగురే ఉన్నారు.

70ఏళ్లు దాటిన వారిలో చంద్రబాబు (74), ఆనం రాం నారాయణరెడ్డి (71), ఎండీ ఫరూక్ (75) ఉండగా... 40 - 50 మధ్య ఉన్నవారిలో అనిత (40), నారా లోకేష్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మందపల్లి రాం ప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు.

Tags:    

Similar News