జగన్ వారికి షాక్ ఇవ్వబోతున్నారా...?
అయితే సీఎం ఇలా పిలిపించుకున్న వారి విషయంలో చెప్పాల్సింది చెబుతున్నారు అని అంటున్నారు.
ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ దొరకలేదు అని తెగ కలవరపడుతున్న ఎమ్మెల్యేలకు ఇపుడు ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచే పిలుపు వస్తోంది. దాంతో వారంతా ఏంటో అని కలవరపడుతున్నారు. మరో వైపు సీఎం ని కలసి తమ సమస్యలు చెప్పుకోవచ్చు అని కూడా తలుస్తున్నారు. అయితే సీఎం ఇలా పిలిపించుకున్న వారి విషయంలో చెప్పాల్సింది చెబుతున్నారు అని అంటున్నారు.
ఇటీవల కొందరు నేతలకు ఎమ్మెల్యేలకు సీఎం నుంచి పిలుపు రావడం కలుసుకోవడం జరిగింది. అయితే అలా వెళ్ళిన వారికి ఏమి చెప్పారన్నది తెలియడం లేదు కానీ గడప గడపకు ప్రోగ్రాం లో వారు వెనకబడి ఉన్నారని మాత్రం చెప్పి ఉంటారని అంటున్నారు.
ఎందుకంటే ఈ మధ్య దాకా ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ ని జగన్ నిర్వహించి గడప గడపకు కార్యక్రమంలో వెనకబడిన వారి గురించి చెప్పారని అంటున్నారు. ఇపుడు కూడా వారికే పిలుపులు వస్తున్నాయని అంటున్నారు. అలా రాయబారాలు అందుకున్న వారు కాస్తా ఇపుడు ఏమీ బయటకు చెప్పడంలేదు కానీ సీఎం ని కలవాల్సిన వారు మాత్రం తెగ ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.
ఇక సీఎం ని కలవమని పిలుపు వచ్చిన వారిలో మంత్రులు కూడా ఉన్నారని అంటునారు. మరి వారందరికీ సీఎం జగన్ ఏమి చెప్పి ఉంటారో కానీ సీఎం ఆఫీసు నుంచి పిలుపు అంటే ఎమ్మెల్యేలు జడుసుకుంటున్నారుట.
ఇక ప్రతీ రోజూ కనీసం పది మంది దాకా ఎమ్మెల్యేలకు అలాగే కొందరు మంత్రులకు ఈ విధంగా పిలుపులు వస్తున్నాయని అంటున్నారు. ఇక చాలా మంది వీరిలో గడప గడపకు కార్యక్రమానికి వెళ్లడంలేదని కూడా సర్వే నివేదికలు ముఖ్యమంత్రి టేబిల్ మీద ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా ఎవరి పనితీరు బాగలేకపోతే వారికి టికెట్లు ఇవ్వమని జగన్ ఖరాఖండీగా చెప్పేస్తారు అని అంటున్నారు.
అందులో ఎవరికీ మినహాయింపు లేదని అంటున్నారు. అయితే కొందరు సీనియర్లకు ఏమైనా రిజర్వేషన్ ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. పనిచేయకుండా ఉన్న వారికి టికెట్లు ఇచ్చినా అది చివరికి పార్టీకే ఇబ్బంది కాబట్టి సీఎం కఠినంగా ఉంటారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మాత్రం జగన్ మాత్రం ఈసారి సర్వేల మీదనే ఆధారపడి టికెట్లు ఇస్తారని అంటున్నారు. అలాగే తన వద్దకు వరసబెట్టి పిలిపించుకుంటున్న ఎమ్మెల్యేలకు ఆ శుభ వర్తమానం వినిపిస్తున్నారు అని అంటున్నారు.