బాబుకు దక్కని ఆ రికార్డు కోసం జగన్ పంతం!

ఏపీలో 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఎడ తెగని చర్చగానే ఉంది. ఎందుకంటే ఆరు నెలల సమయం మాత్రమే ఎన్నికలకు ఉంది

Update: 2023-10-10 04:01 GMT

ఏపీలో 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఎడ తెగని చర్చగానే ఉంది. ఎందుకంటే ఆరు నెలల సమయం మాత్రమే ఎన్నికలకు ఉంది. జగన్ నోటి వెంట వచ్చిన మాట ఏంటి అంటే మార్చిలోనే ఎన్నికలు అని. సో కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది.

ఇక ఏపీలో రాజకీయ నాయకులు పలువురు ఎలాంటి రికార్డుకు క్రియేట్ చేశారో ఒకసారి చూస్తే ఎన్టీయార్ ది అసలైన రికార్డు. ఆయన పార్టీని పెట్టిన తొమ్మిది నెలలలో అధికారంలోకి వచ్చారు. అలా 1983లో గెలిచిన ఎన్టీయార్ తిరిగి రెండేళ్ళు తిరగకుండానే నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో మరోసారి ఎన్టీఆర్ గెలిచి సత్తా చాటారు. అలా ఎన్టీఆర్ వరసగా రెండు సార్లు గెలిచిన సీఎం గా రికార్డులకు ఎక్కారు. 1989లో ఓడిన ఎన్టీఆర్ 1994లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ 226 సీట్లు గెలిచి మరో రికార్డు నెలకొల్పారు.

ఆయన నుంచి అధికారం 1995 సెప్టెంబర్ లో చేజిక్కించుకున్న చంద్రబాబు 1999లో తన నాయకత్వంలో పోటీ చేశారు. అలా తొలిసారి ఆయన గెలిచారు. ఆ గెలుపును ఆయన 2004లో వరసగా కంటిన్యూ చేయలేకపోయారు. 2004, 2009లలో వరసగా గెలిచి వైఎస్సార్ ఎన్టీఆర్ రికార్డుని సమం చేశారు. ఇక విభజన తరువాత తెలంగాణాలో 2014, 2018లలో వరసగా కేసీయార్ గెలిచి తానూ ఎన్టీఆర్ వైఎస్సార్ సరసన నిలిచాను అనిపించుకున్నారు. ఇపుడు హ్యాట్రిక్ విజయం సాధించి సౌతిండియాలోనే వరసగా మూడు సార్లు గెలిచిన తొలి సీఎం రికార్డుని సాధించాలని చూస్తున్నారు.

ఏపీ విషయానికి వస్తే 2014లో సీఎం అయిన చంద్రబాబు 2019లో ఆ వరస విజయాన్ని కొనసాగించలేకపోయాడు. ఇపుడు జగన్ విషయం తీసుకుంటే ఆయన 2019లో గెలిచారు. 2024లో కూడా గెలుస్తాను అంటున్నారు. ఈ విషయంలో తన తండ్రి వైఎస్సారే స్పూర్తి అంటున్నారు. 2009లో వైఎస్సార్ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కట్టిన మహాకూటమిని ఎదిరించి మరీ రెండోసారి అధికారం దక్కించుకున్నారు. అదే బాటన తాను నడచి విపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఒంటరిగా గెలిచి చూపిస్తాను అంటున్నారు.

ప్రస్తుతానికి చూస్తే ఏపీలో వైసీపీకి కొంత అనుకూల వాతావరణం కనిపిస్తోంది. సర్వేలు అన్నీ కూడా ఆ పార్టీయే మరోసారి వస్తాయని అంటున్నారు. టీడీపీని చంద్రబాబు ఎంతలా జనంలోకి తీసుకెళ్ళినా గెలుపు ఆశలు మాత్రం ఇంకా కలగడంలేదు. ఇంతలో ఆయన అరెస్ట్ అయి జైలులోకి వచ్చారు. జనసేన పవన్ కళ్యాణ్ బలం ఏంటి అన్నది కూడా ఎటూ తేలకుండా ఉంది. ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. కులం బలం ఉంది అని అంటున్నారు. కానీ అవి ఓట్లుగా టర్న్ అయ్యేది పెద్దగా లేదని 2019 ఎన్నికలు నిరూపించాయి.

అయితే ఇపుడు పొత్తులలో ఉంటారు కాబట్టి ఏమైనా ప్రభావం ఉంటుందా అన్నది చూడాలి. ఏది ఎలా చూసుకుంటా వైసీపీలో ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది అంటున్నారు. వైసీపీ గేర్ మార్చింది స్పీడ్ పెంచింది అని మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పాత సైకిల్ కొత్త గ్లాస్ కలసికట్టుగా వచ్చినా దెబ్బ తినడం ఖాయం అని అంబటి అంటున్నారు.

వీరి విషయం పక్కన పెట్టినా వైఎస్ ఫ్యామిలీకి ఉన్న సెంటిమెంట్లు, జగన్ జాతక బలం, వర్తమాన రాజకీయ పరిస్థితులు ఇవన్నీ చూసినపుడు వైసీపీకి సీట్లు తగ్గిన మరోసారి గెలుస్తుంది అనే అంటున్నారు. అదే జరిగితే బాబు సాధించలేని రికార్డు జగన్ సొంతం అవుతుంది. వరసగా రెండవసారి గెలిచి మొనగాడు అవుతారు. మరి అది జరుగుతుందా లేదా అన్నది 2024 ఎన్నికల ఫలితాలు చాటి చెప్పనున్నాయి.

Tags:    

Similar News