ఏపీలో ఉప ఎన్నికలు.. ఇదే బిగ్ హాట్ టాపిక్..?
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే.. ఏం జరుగుతుంది? వైసీపీ వర్సెస్ టీడీపీ గా ఉన్న ఈ విషయం ఇప్పుడు ప్రతి ప్రాంతానికి చేరిపోయింది.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే.. ఏం జరుగుతుంది? వైసీపీ వర్సెస్ టీడీపీ గా ఉన్న ఈ విషయం ఇప్పుడు ప్రతి ప్రాంతానికి చేరిపోయింది. ఎక్కడ ఏ నలుగురు గుమిగూడినా.. ఇదే చర్చ సాగుతుండ డం మరింత విశేషం. టీడీపీ ఎమ్మెల్యే ఉపసభాపతి రఘురామకృష్ణరాజు.. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గురించి చేసిన కామెంట్ల తర్వాత.. కూటమిలో తొలుత ఈ చర్చ తెరమీదికి వచ్చిం ది. నిన్న మొన్నటి వరకు రఘురామ తన కేసులపై పోరాటం చేసిన విషయం తెలిసిందే.
అయితే.. ఇప్పుడు ఏకంగా ఆయన జగన్‌నే టార్గెట్ చేసుకున్నారు. వరుసగా 60 రోజులు సభకు రాకపోతే.. జగన్ ఎమ్మెల్యే సభ్యత్వం ఊడుతుందని..ఆయన గత రెండు రోజులుగా ఎక్కడ మాట్లాడినా చెబుతున్నా రు. నిజానికి సభ వరుసగా 60 రోజులు జరగాల్సి ఉంది. దీనికి సభా నాయకుడిగా ఉన్న సీఎం చంద్రబాబు ఓకే చెప్పాలి. అప్పుడు కూడా జగన్ వరుసగా రాకపోతే.. ఆయన సభ్యత్వం రద్దవుతుంది. అయితే.. ఇక్కడ ఆయన ఒక్కరే కాదు.. వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది సభ్యత్వం కూడా రద్దవుతుంది.
ఇదే జరిగితే.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. అయితే.. ఈ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గితే.. ఒకటి రెండు రోజులు సభకు వచ్చినా.. వారు క్షేమంగానే ఉంటారు. కానీ, ప్రస్తుతం పంతానికి పోతున్న జగన్.. సభకు వచ్చేది లేదని.. తనకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వాల్సిందేన ని పట్టుబడుతున్నారు. సో.. ఈ రెండు కారణాలతో ఉప ఎన్నికలకు అవకాశం లేకపోలేదన్న చర్చ సాగు తోంది. ఒకవేళ ఇదే జరిగితే.. రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉంటాయి? ఉప ఎన్నికల్లో ఎవరు విజయం దక్కించుకుంటారన్న చర్చ సాగుతోంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత అయితే లేదు. అలాగని సానుకూలత కూడా పూర్తిగా రాలేదు. పాలన ప్రారంభించి 8 నెలలే అయిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చంద్రబాబుపైనా.. ప్రభుత్వంపైనా వ్యతిరేకత లేనందున.. ఉప ఎన్నికలు వచ్చినా.. వైసీపీకి అంత మెరుగైన ఫలితం దక్కే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే.. జగన్‌పై కొంత సానుభూతి కనిపిస్తున్న దరిమిలా.. వైసీపీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ సభ్యులే విజయం దక్కించుకునే అవకాశం ఉంది. అయితే.. ఇక్కడ మరో కోణం కూడా కనిపిస్తోంది. ఉప ఎన్నికలు వచ్చే సూచనలే కనుక ఉంటే.. సగానికి పైగా వైసీపీ ఎమ్మెల్యే లు పార్టీ మారే అవకాశం ఉందని.. కూడా భావిస్తున్నారు.