వైసీపీలో వారసుల హోరు

ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే తన వారసులకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-08-21 10:51 GMT

ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కూడా లేదు. ఇప్పటి నుంచే ఇటు అధికార పార్టీ వైసీపీ, అటు ప్రత్యర్థి పార్టీలు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చేరికలు, టికెట్లపై ఊహాగానాలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీలో వారసుల హోరు ఎక్కువగా వినిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వారసులను బరిలో దింపేందుకు చాలా మంది వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే తన వారసులకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన గోపాలక్రిష్ణకు మరోసారి టికెట్ ఇస్తే స్వతంత్రంగా పోటీ చేసేందుకు వెనుకాడబోమని కూడా సుభాష్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. తన టికెట్ను కొడుకు అభినయ్ రెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఖాయమైందని చెబుతున్నారు.

ఇంకా ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మంత్రి విశ్వరూప్, ఎంపీ ధర్మాన ప్రసాదరావు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు తమ వారసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ జగన్ను కోరుతున్నారు. కొంతమంది విషయంలో సానుకూలంగా ఉన్న జగన్.. మిగతా వారి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని సమాచారం.

Tags:    

Similar News