4 రోజులు వైసీపీ ఉత్సాహవంతులు తగ్గితే బాగుండు

ఉత్సాహం తప్పు కాదు. ఆ పేరుతో వెనుకా ముందు చూసుకోకుండా వ్యవహరించటం వల్ల అభాసుపాలు అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది

Update: 2024-05-30 06:42 GMT

ఉత్సాహం తప్పు కాదు. ఆ పేరుతో వెనుకా ముందు చూసుకోకుండా వ్యవహరించటం వల్ల అభాసుపాలు అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. తొందరపాటుతో చేసే తప్పులు తర్వాత ఎంత తీరిగ్గా బాధ పడినా జరిగిన డ్యామేజ్ ను తగ్గించలేని పరిస్థితి ఉంటుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు జగన్ అభిమానులు కొందరు. సీఎం జగన్ మీద తమకున్న అమితమైన అభిమానాన్ని తమ చేతలతో చూపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ పూర్తి కావటం.. ఫలితాలు సైతం మరో నాలుగైదు రోజుల్లో వచ్చేస్తుండటంతో.. తాము గెలుస్తామంటే.. తాము గెలుస్తామన్న హడావుడి మాటలు ఎక్కువ అవుతున్నాయి.

ఈ విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశంతో పోలిస్తే .. అధికార వైసీపీ వర్గానికి చెందిన వారి ఉత్సాహమే ఎక్కువగా కనిపిస్తోంది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని.. మంగళగిరిలో లోకేశ్.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని.. తాము తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న అంచనాను రేఖామాత్రంగా చెబితే బాగానే ఉంటుంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా.. తాము ఎన్నికల్లో గెలవటంఖాయమని ఢంకా బజాయించి చెప్పుకోవటం వరకు బాగున్నా.. వైసీపికి చెందిన కొందరు చేస్తున్న అతి ప్రచారం రానున్న రోజుల్లో ఇబ్బందిని కలిగిస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఎన్నికల్లో విజయంపై ఉన్న నమ్మకాన్ని మాటల్లో చెప్పటం వరకు బాగానే ఉన్నా.. తాము రెండోసారి ప్రభుత్వాన్ని జూన్9న ఏర్పాటు చేస్తామని.. వైఎస్ జగన్ ఆ రోజున విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు. దీన్ని కూడా తప్పుగా చూపించలేం. గెలుపు మీద ధీమా అని సరిపెట్టుకోవచ్చు. కాకుంటే.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసే రోజు.. ఏపీ వ్యాప్తంగా ఉండే వైసీపీ అభిమానులు విశాఖకు వెల్లువలా వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారన్న మాటను చెబుతున్నారు.

అక్కడితో ఆగకుండా.. ఆరోజున వైసీపీ అభిమానులకు ఉదయం వేళలో వడ్డించే బ్రేక్ ఫాస్టు.. మధ్యాహ్నం వడ్డించే లంచ్ కు సంబంధించిన మెనూ కూడా సిద్ధమంటూ పోస్టులు పెట్టటాన్ని చూసినప్పుడు మాత్రం అవాక్కు కాక తప్పదు. ఎంత గెలుపు మీద ధీమా ఉన్నప్పటికీ.. మరీ ఇంత హడావుడి అవసరమా? అన్న భావన కలుగక మానదు. రెండు రోజులుగా.. ఒక వైరల్ పోస్టు అందరిని ఆకర్షిస్తోంది. ఎన్నికల్లో విజయంపై ఏపీ అధికారపక్షం ఎంతటి ధీమాతో ఉందన్న విషయాన్ని తాజా పోస్టు చెబుతుందంటూ కొందరు కొన్ని గ్రూపుల్లో ఉత్సాహంగా పోస్టు చేస్తున్నారు. ఈ పోస్టును చూసిన వారు మాత్రం అవాక్కు అవుతున్నారు. ఉత్సాహం ఫర్లేదు కానీ.. మరీ ఈ స్థాయిలో ఉంటే మాత్రం తట్టుకోలేమన్న మాట వారి నోటి నుంచి వినిపించటం గమనార్హం.

వైరల్ పోస్టు ఇదే...

జూన్ తొమ్మిదవ తారీఖున జగనన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేస్తున్న లక్షలాది మంది జగనన్న అభిమానులకు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా వడ్డించనున్న వంటకాలు లిస్ట్ రెడీ చేసిన ఆహార కమిటీ...

అల్పాహారం:

👉 మసాలా ఇడ్లీ

👉 ఎమ్మెల్యే పెసరట్టు

👉 జీడిపప్పు ఉప్మా

👉 పులిహోరా

👉 పెరుగు వడ

👉 సాంబార్ వడ

👉 మసాలా దోశ.

👉 చాక్లెట్ దోశ.

👉 చక్కర పొంగల్.

👉 పాయసం.

👉 పోహా వేపుడు

👉 బొబ్బట్లు (ఆంధ్ర స్వీట్)

👉 పునుగులు

నాన్-వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఐటెమ్స్:

👉 చికెన్ పెసరట్టు

👉 ఎగ్ దోస

👉 చికెన్ దోశ

👉 మటన్ ఖీమా దోస

👉 ఎగ్ భుర్జి విత్ పావ్

👉 మటన్ కీమా ఇడ్లీ

👉 చికెన్ పొంగల్

👉 అరిసెలు (ఆంధ్ర స్వీట్)

👉 బోటి వడ.

👉 నాటుకోడి పులుసు పెసర పునుగులు.

👉 మద్రాస్ ఫిల్టర్ కాఫీ

👉 ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్

👉 కోకోనట్ వాటర్

లంచ్ మేను వెజిటేరియన్ లంచ్ ఐటెమ్స్:

👉గోంగూర పప్పు

👉బెండకాయ పులుసు

👉వంకాయ పచ్చడి

👉మామిడికాయ పప్పు

👉వెజిటబుల్ బిర్యాని

👉టమాటో పప్పు

👉గుత్తి వంకాయ కూర

👉ఉలవ చారు.

👉ఆంధ్ర అవకాయ (మంగో పికిల్)

👉దొండకాయ ఫ్రై

👉ఆలూ కుర్మా

👉 సాంబార్

👉రసం

👉కర్డ్ రైస్

👉పూతరేకులు (ఆంధ్ర స్వీట్)

👉బూంది లడ్డు

నాన్-వెజిటేరియన్ లంచ్ ఐటెమ్స్:

👉ఆంధ్రా చికెన్ కర్రీ

👉మటన్ పులావ్

👉చేపల పులుసు

👉బొమ్మిడాల పులుసు

👉నాటు కోడి వేపుడు

👉టైగర్ రొయ్యల ఇగురు

👉గోంగూర మటన్

👉కోనాం ఫిష్ ఫ్రై

👉చికెన్ బిర్యానీ

👉నాటు కోడి పులుసు

👉నాటు కోడి చిట్టి ముత్యాల బిరియాని.

👉నాటు కోడి రాగి సంగటి.

👉ఖీమా కోఫ్తా కర్రీ

👉ఎగ్ మసాలా కర్రీ

👉ఖుబానీ కా మీఠా (ఆంధ్ర స్వీట్)

👉బెవరేజెస్ ఫోర్ లంచ్:

👉స్పైస్ బట్టర్ మిల్క్

👉మాంగో లస్సీ

👉ఫ్రెష్ లైమ్ సోడా

👉తీపి చెక్కలు

👉బెల్లం జిలేబీలు

👉బెల్లం లడ్డులు

👉తీపి బూంది మిక్చర్,

👉మాడుగుల హల్వా.

👉కాకినాడ ఖాజా

👉తాపేశ్వరం ఖాజాలు.

👉10 రకాల ఐస్ క్రీమ్స్

👉ఫ్రూట్ సలాడ్

👉కలకత్తా ఆకుతో స్పెషల్ చాక్లెట్ పాన్.

ఇట్లు

ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి.

చైర్మన్ ఆహార విభాగం..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవ ప్రోగ్రామ్ కమిటీ.

Tags:    

Similar News