వైసీపీ నేతల మౌనం వెనక ఇంత భయం ఉందా..?
అది టీడీపీ అయినా.. జనసేన అయినా.. బీజేపీ అయినా.. ఒక్కటే. దీనికి ఎవరూ అతీతులు కారు.
ఎన్నికల్లో ఓటమి దెబ్బకు వైసీపీ నేతలు మౌనంగా ఉంటున్నారా? లేక భయంతో తెరమరుగు అవుతున్నారా? అన్నది ప్రశ్న. ప్రస్తుతం జరుగుతున్న చర్చ చూస్తే.. జగన్ అంటే ఇష్టం లేకనే సీనియర్లు మౌనంగా ఉంటున్నారని.. అందుకే పార్టీకి, రాజకీయాలకు కూడా దూరమవుతున్నారని కొందరు సరికొత్త వాదనను తెరమీదికి తెస్తున్నారు. వాస్తవం ఏంటంటే.. ఏ పార్టీలో అయినా.. నాయకులు కొందరు మాత్రమే నిబద్ధతతో ఉంటారు. ఇంకొందరు అవకాశం కోసం ఉంటారు.
అది టీడీపీ అయినా.. జనసేన అయినా.. బీజేపీ అయినా.. ఒక్కటే. దీనికి ఎవరూ అతీతులు కారు. అయితే.. వైసీపీకి కొంత మేరకు ఈ విషయంలో వెసులుబాటు ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి జగన్‌పై ఉన్న అభిమానంతో పార్టీలో ఉన్నవారు 30 శాతం మంది మాత్రమే. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే.. ఇతర పార్టీలు వారిని తీసుకోవు. లేదా.. వైఎస్‌కుటుంబంతో ఉన్న అవినాభావ సంబంధం కావొచ్చు. మొత్తానికి వారు జగన్‌తో మమేకం అయ్యారు.
మిగిలిన 70 శాతం మంది కూడా వ్యాపారాలు, అవసరాలు, అవకాశాల కోసమే జగన్ వెంట ఉన్నారు.ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇలాంటి వారు కూడా ఇప్పుడు పార్టీ మారకుండా.. మౌనంగా ఉంటున్నారు. దీనికి కారణం .. పొరుగు పార్టీల్లో అవకాశం లేకపోవడం, అవకాశాలు రాకపోవడమే. అయితే.. మౌనంగా ఉండడానికి ప్రదాన కారణం.. తమపై ఉన్న కేసులు కావొచ్చు.. రాజకీయంగా ప్రత్యర్థులు తిరగబడతారన్న వ్యూహం కావొచ్చు.
అందుకే మెజారిటీ నాయకులు మౌనంగా ఉంటున్నారు. దీనిని జగన్‌కు ముడిపెట్టి చూడలేం. ఇతర పార్టీ లకు.. జగన్ పార్టీకి మధ్య తేడా ఉంది. జగన్ స్వయంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ కావడం.. తన నేతృ త్వంలోనే కార్యక్రమాలు ముందుకు సాగాలన్న లక్షణం ఆయన సొంతం చేసుకోవడం కారణంగానే ఇప్పు డు పార్టీలో ఆయన కంట్రోల్ ఎక్కువగా కనిపిస్తోంది.
వాస్తవానికి జగన్ అంటే.. ఇష్టం లేని వారో.. కాదనేవారో.. ఆ పార్టీలో లేరు. అంతా ఇష్టపడే ఉంటున్నారు. అయితే.. అవకాశం కోసం ఎదురు చూసేవారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూటమి సర్కారు కంట్లో పడడం కంటే.. వారి విషయంలో మౌనంగా ఉంటే.. ఇప్పుడు కాకపోతే.. మరో రెండేళ్ల కైనా తమకు అవకాశం చిక్కుతుందన్న ఆశే వారిని నడిపిస్తోందన్నది వాస్తవం. అందుకే ఈ మౌనం!!