ఆ ఒక్క త‌ప్పే వైసీపీని నిండా ముంచేసిందా..?

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-29 11:30 GMT

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు ఏడాదిన్నర పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలను సైతం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు పంపించారు. వారి సమస్యలు తెలుసుకోవాలని, వారి సమస్యలు పరిష్కారం అయ్యేలాగా ప్రయత్నం చేయాలని అదేవిధంగా ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించాలని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అలానే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజల మధ్య తిరిగారు. వాస్తవమే కానీ.. ఇక్కడ జరిగింది ఏంటి అని చూస్తే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేశారని, ఇప్పుడు తేటతెల్ల‌మైంది. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు కూడా అప్పట్లో పరిష్కారం కాలేదు. ఈ విషయం ఇప్పుడు వెలుగు చూస్తోంది. చిన్న చిన్న డ్రైనేజీల పూడిక తీయించడం, కాలువలు నిర్మించకపోయిన కనీసం శుభ్రపరచడం, విద్యుత్తు వైర్లు తమ ఇళ్ల మీదుగా వెళుతున్నాయని వాటిని తొలగించాలని ప్రజలు ప్రాథమిక పట్టించుకోకపోవడం దోమల నివారణ ఇలా అత్యంత చిన్న చిన్న విషయాలను అప్పటికప్పుడు అయ్యే విషయాలను కూడా వైసిపి నాయకులు పట్టించుకోలేదు పరిష్కరించలేదు.

ఇలా రెండు మూడు సంవత్సరాల నుంచి వేధిస్తున్న ఈ చిన్న చిన్న సమస్యలు వైసిపి పై తీవ్ర వ్యతిరేకతను పెంచేశాయి. ``వైసీపీ నాయ‌కులకు ఏం చెప్పినా ఉపయోగం లేదు. మా మాట వినడం లేదు`` అని ప్రజలు అనుకునేలా చేసాయి. కానీ ఇది జగన్ తప్పు కాదు. జగన్ తన స్థాయిలో తను చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాల్సిన నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఈ విషయంలో తీవ్రంగా అలసత్వం ప్రదర్శించారు. ఫలితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

ఇక‌, ఇప్పుడు టీడీపీ నాయకులు రోజుల వ్యవధిలోనే పరిష్కరించేస్తున్నారు. దీనికి పెద్ద కష్టం లేదు. దీనికి ఆర్థికంగా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి దగ్గర పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం తమ పరిధిలో ఉన్న అధికారికుల‌కు ఫోన్ చేసి రప్పించడం ద్వారా సమస్యను వివరించి పరిష్కరించే అవకాశం ఉంది ఇప్పుడు దానిని టిడిపి నాయకులు అమలు చేస్తున్నారు చాలా చోట్ల చిన్న చిన్న సమస్యలు వెంట వెంటనే పరిష్కారం అయిపోతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండగా వైసీపీ నాయకుల మితిమీరిన నిర్లక్ష్యం ప్రజల మాటలు పట్టించుకోకపోవడం ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయి.

మరి జగన్ మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియకుండానే ఉందా ఎవరు చెప్పలేదా అంటే అది ఆయనే ఆలోచించుకోవాలి ఏదేమైనా భారీ స్థాయిలో అప్పులు చేసి కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పుకున్న ఫలితం మాత్రం కనిపించకపోవడానికి క్షేత్రస్థాయిలో నాయకులు వ్యవహరించిన తీరే ప్రధాన కారణంగా ఇప్పుడు ప్రస్తుతం అవుతుంది ఏదేమైనా వైసీపీ నాయకులు తమను తాము మోసం చేసుకోవడంతో పాటు పార్థిని సైతం మోసం చేశారని చెప్పాలి.

Tags:    

Similar News