12 మంది వైసీపీ ఎమ్మెల్సీలు జంప్ ?

శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. మండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందినవారే.

Update: 2024-07-22 10:30 GMT

శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. మండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందినవారే. ఇదే ఇపుడు టీడీపీ కూటమికి అతి పెద్ద సమస్యగా ఉంది. శాసనసభలో అయితే కేవలం 11 మంది ఎమ్మెల్యేలు తప్ప అంతా కూటమిదే రాజ్యం. కానీ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు మండలిలో ఆమోదం పొందాలంటే కష్టమే అంటున్నారు.

అక్కడ వైసీపీకి 30 మంది దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంతో మండలిలో ఆధిక్యతను కూటమి సాధించాల్సి ఉంది. అది పద్ధతి ప్రకారం జరగాలంటే రెండేళ్ళ పైగా సమయం పడుతుంది. కానీ ఆపరేషన్ ఆకర్ష్ తో కనుక లాగేయాలనుకుంటే వెంటెనే జరిగిపోతుంది.

అలా ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహిస్తుందా అంటే తప్పదు అని అంటున్నారు. దానికి తోడు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా కొందరు అధికారం రుచి చూడాలనుకుంటున్నారు అని అంటున్నారు. విపక్షంలో ఉంటే పోరాటాలు నిరసనలు తప్ప ఏమీ ఉండదు, అదే అధికార కూటమిలో ఉంటే కనుక బాగానే జరిగిపోతుంది అన్న ముందు చూపు ఉన్న వారు అంతా పక్క చూపులు చూస్తున్నారు అని అంటున్నారు.

దాంతో ఇపుడు ఒక కొత్త ప్రచారం సాగుతోంది. ఏకంగా 12 మంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ వైపు చూస్తున్నారు అన్నదే ఆ ప్రచారం సారాంశం. ఏకంగా 12 మంది అంటే బిగ్ నంబర్ గానే చూడాలి. 30 మంది దాకా ఉన్న వైసీపీ బలం శాసన మండలిలో ఒక్కసారిగా 18కి పడిపోతుంది. అదే టైం లో మ్యాజిక్ ఫిగర్ ప్రస్తుతం 28 ఉంది. దానికి ఈజీగా టీడీపీ కూటమి చేరుకుంటుంది అని అంటున్నారు.

ఇక ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరే వాళ్ళుంటారు కొందరు. ఇలా బటర్ ఫ్లై లీడర్లను తీసుకుని వచ్చి వారి వల్ల మనకు లాభం అని జగన్ కి చెప్పి మరీ ఎమ్మెల్సీలుగా వారిని కొందరు వైసీపీలో లీడర్లు చేయించారు. ఇపుడు ఆ బటర్ ఫ్లై లీడర్లే గోడ దూకేస్తున్నారు అని అంటున్నారు.

ఇక వారి పేరు కూడా జిల్లాలలో ఎవరికీ తెలియకపోయినా సామాజిక సమీకరణల పేరుతో సీట్లు జగన్ ద్వారా ఇప్పించారు. అలాంటి వారు వైసీపీలో ఇపుడు కొందరు ఉన్నారని అంటున్నారు. ఇలా తప్పుడుగా సమాచారం ఇచ్చి సామాజిక సమీకరణలు అంటూ జగన్ కి తప్పుదోవ పట్టించిన నేతల వల్ల ఇపుడు వైసీపీకి ఎమ్మెల్సీల రూపంలో భారీ షాక్ తగలబోతోంది అని అంటున్నారు.

అధికారం లేని చోట అయిదేళ్ల పాటు ఖాళీగా ఉండడం ఎందుకు అన్న ఆలోచనలో కొందరు ఎమ్మెల్సీలు ఉన్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏకంగా ఒక డజన్ మంది ఎమ్మెల్సీలు టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

అటు చూస్తే టీడీపీకి ప్రాణావసరం ఉంది. శాసన మండలిలో టీడీపీ కూటమికి మెజారిటీ కావాలి. దాంతో ఇటు చేరడానికి చాన్స్ కోసం వైసీపీ ఎమ్మెల్సీలు చూస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా రెండిందాలా ప్రయోజనం అనుకోవడం వల్లనే ఈ భారీ నంబర్ కనిపిస్తోంది అని అంటున్నారు.

అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్సీలు వస్తే వారి అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా వర్గ పోరు స్టార్ట్ అవుతుందేమో అన్న ఆలోచన ఉందిట. టీడీపీ ఎమ్మెల్యేలను సవాల్ చేసే విధంగా అలగే సమాంతరంగా రాజకీయం చేస్తూ పోతే అపుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వర్గాలుగా మారి కొత్త తలనొప్పులు వస్తాయని అంటున్నారు.

దాంతో పాటుగా తమతో సంప్రదించిన మీదటనే ఎమ్మెల్సీలను తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు అధినాయకత్వాన్ని కోరుతున్నారుట. ఇక టీడీపీ వ్యూహాలు చూస్తే వేరే విధంగా ఉన్నాయి. శాసన మండలిలో మోషెన్ రాజు ని దించడం తమ పార్టీ వారిని గద్దెనెక్కించడం ద్వారానే మండలిలో బిల్లులు సులువుగా పాస్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారుట. ఏది ఏమైనా ఈ ఆపరేషన్ తొందరగానే సాగుతుంది అని అంటున్నారు. వైసీపీ కి బలం ఉన్న చోటనే దెబ్బ కొట్టడం ద్వారా ఉభయ సభలలో ఆ పార్టీని వీక్ చేయాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక అధికారం వైపుగా సాగే వారిని ఎవరూ ఆపలేరు కాబట్టి వైసీపీ ఈ భారీ షాక్ ని ఎదుర్కోవాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News