వెళ్ళిపోతున్నా లైట్ తీసుకుంటున్న వైసీపీ...మ్యాటర్ క్లియర్...!?

వైసీపీ అధినాయకత్వం ఒక విషయమో బేఫికర్ గా ఉంది. తాము అనుకున్న వారికే టికెట్లు ఇస్తోంది.

Update: 2024-01-15 15:30 GMT

వైసీపీ అధినాయకత్వం ఒక విషయమో బేఫికర్ గా ఉంది. తాము అనుకున్న వారికే టికెట్లు ఇస్తోంది. కొందరు నేతల విషయంలో మాత్రం పార్టీని వీడిపోతున్నా లైట్ తీసుకుంటోంది. దానికి కారణం ఏంటి అంటే సింపుల్ అని అంటున్నారు. పోతున్న వారి వ్యవహారాలు కార్యకలాపాలు అన్నీ వైసీపీ హై కమాండ్ కి ముందే తెలుసు అని అందుకే టికెట్ కి టిక్కు పెడుతోందని అంటున్నారు.

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే టీడీపీతో టచ్ లోకి వెళ్ళి వచ్చిన తరువాతనే వైసీపీ మీద అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆ తరువాత ఎటూ టికెట్ దక్కలేదని దాంతో ఇపుడు ఓపెన్ అయి టీడీపీలోకే వెళ్తున్నారని గుర్తు చేస్తున్నారు. అలాగే ఇదే జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారని ఆయన కూడా టికెట్ లేదు అనగానే జనసేన టచ్ లోకి వెళ్లిపోయారని అంటున్నారు.

వీరే కాదు చాలా మంది ఎమ్మెల్యేల విషయంలో నేతల విషయంలో ఇలగే సీన్ ఉదని అంటున్నారు. అందుకే వెళ్ళిన వారు వెళ్లనీ అన్నట్లుగానే వైసీపీ హై కమాండ్ ఉందని అంటున్నారు. గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ఆ పార్టీ పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి యాంటీగా వెళ్ళి ఓటేసి ఆ తరువాత సస్పెండ్ అయ్యారు.

అలా పార్టీలో ఉంటూ వెన్నుపోటు కీలక సమయంలో పొడిచే కంటే బయటకు వెళ్లడమే బెటర్ అని అంటున్నారుట. ఇక కొన్నాళ్ళుగా వైసీపీలో జరుగుతున్న వ్యవహరాలు పనిగట్టుకుని కొందరు లీక్ చేసే వీరులు కూడా ఉన్నారని వైసీపీ హై కమాండ్ అనుమానిస్తోందిట. అలాంటి వారి విషయంలో చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది అని అంటున్నారు.

పార్టీకి గెలుపు ఎంత ముఖ్యమో విధేయత కూడా అంతే ముఖ్యమని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీ లాగేసింది. అలాంటి అనుభవాలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే టికెట్ల ఎంపిక నుంచే కఠినంగా ఉండాలని కూడా హై కమాండ్ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు

అందుకే ఎంతటి పెద్ద లీడర్స్ అయినా విధేయత విషయంలో డౌట్లు వస్తే మాత్రం రెడ్ సిగ్నల్ పడినట్లే అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ మరో జాబితా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అందులో మంత్రులు సీనియర్ నేతల టికెట్ల విషయం తేల్చబోతున్నారు అని అంటున్నారు.

బహుశా వైసీపీ ఇంచార్జిల మార్పులో అదే అసలైన బిగ్ ట్విస్ట్ గా చెబుతున్నారు. ఉత్తరాంధ్రాలో కూడా బిగ్ షాట్స్ అనబడే వారి విషయం కూడా ఈ లిస్ట్ లో తేల్చబోతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News