పశ్చిమ బెంగాల్ లో అడ్డంగా బుక్కైన యూసుఫ్ పఠాన్?

దేశంలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం షురూ అయింది. రాజకీయపార్టీల్లో ఎన్నికల వేడి రగులుకుంటోంది.

Update: 2024-03-28 11:30 GMT

దేశంలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం షురూ అయింది. రాజకీయపార్టీల్లో ఎన్నికల వేడి రగులుకుంటోంది. పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. ఇందులో భాగంగా పరస్పర ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు పెరుగుతున్నాయి. బెంగాల్ లోని బహరంపూర్ నుంచి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

బెంగాల్ లో త్రుణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యూసుఫ్ పఠాన్ 2011లో ప్రపంచ క్రికెట్ కప్ ను గెలిచిన పోస్టర్ ను ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇది ముమ్మాటికి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని లెక్కచేయకపోవడమేనని చెబుతోంది. ఈ మేరకు బెంగాల్ కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది.

బహరంపూర్ నుంచి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అఖిల భారత త్రుణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ అక్కడి ప్రదేశాల్లో బ్యానర్లు, ఫొటోలు వాడటం గమనార్హం. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో సచిన్ టెండుల్కర్ తో సహా ఇతర ఆటగాళ్లను సైతం ఫొటోలు పెడుతూ ఓట్లు రాబట్టుకోవాలని చూడటం గమనార్హం. ఇది ముమ్మాటికి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని చెబుతున్నారు.

ప్రపంచ కప్ ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. మోడల్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ప్రచారం చేసుకోవడంపై ఆక్షేపణలు చేస్తున్నారు. మన జాతీయ నాయకుల ఫొటోలు అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా శిక్షకు అర్హులే అంటున్నారు.

ఇలా పార్టీలు తమ ఇష్టానుసారం ప్రవర్తించడం క్షమించరాని నేరం. ఇలాంటి ఘటనలు ఎదురు కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల ఆగడాలను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి వాటిని ఎవరు కూడా ఉపేక్షించొద్దని సూచిస్తున్నారు. దీనిపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

Tags:    

Similar News