జొమాటో చరిత్రలో సింగిల్ బిల్ రికార్డు
వార్షిక నివేదిక పేరుతో బ్రాండ్ ను ప్రమోట్ చేసుకునే విషయంలో స్విగ్గీకి మించినోళ్లు ఉండరు
వార్షిక నివేదిక పేరుతో బ్రాండ్ ను ప్రమోట్ చేసుకునే విషయంలో స్విగ్గీకి మించినోళ్లు ఉండరు. ఇప్పుడిప్పుడే ఆ సంస్థ తీరునే అనుకరిస్తూ.. తమ వద్ద ఉన్న డేటాలోని ఆసక్తికర విషయాల్ని వెల్లడిస్తోంది జొమాటో. తాజాగా విడుదల చేసిన రిపోర్టులో.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఒక పెద్ద మనిషి తమ వద్ద సింగిల్ బిల్ లో రూ.5లక్షలు చేసినట్లుగా పేర్కొంటూ.. జొమాటో చరిత్రలోనే హయస్ట్ సింగిల్ బిల్ గా పేర్కొంది.
జొమాటో ఆఫర్లతో ఢిల్లీ నివాసితులు తమ భోజన ఖర్చులపై రూ.195 కోట్లను ఆదా చేసినట్లుగా పేర్కొంది. తర్వాతి స్థానంలో బెంగళూరు.. ముంబయి నగరాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 6 మధ్యకు కోటి కంటే ఎక్కువ టేబుల్స్ ను రిజర్వు చేసుకునేందుకు తమ యాప్ ను ఉపయోగించినట్లుగా జొమాటో వెల్లడించింది. ఇందులో ఎక్కువ మంది ఫాదర్స్ డే రోజున రిజర్వు చేసుకున్నట్లుగా తెలిపింది.
2024 ఏడాదిలో 9 కోట్ల కంటే ఎక్కువ మంది బిర్యానీని ఆర్డర్ చేసినట్లుగా పేర్కొంటూ.. సరాసరిన సెకనుకు మూడు బిర్యానీలు చొప్పున ఆర్డర్లను తాము స్వీకరించినట్లుగా పేర్కొంది. గడిచిన తొమ్మిదేళ్లుగా ఎక్కువ మంది ఆర్డర్ చేసుకున్న ఫుడ్ గా బిర్యానీ నిలిచి.. రికార్డు క్రియేట్ చేసినట్లుగా వెల్లడించింది. బిర్యానీ తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్.. పిజ్జాగా పేర్కొటూ.. 2024 డిసెంబరు ఆరు వరకు 5 కోట్ల కంటే ఎక్కువ పిజ్జాలను డెలివరీ చేసినట్లుగా తెలిపింది. ఫుడ్ విషయాన్ని పక్కన పెడితే.. 77.76 లక్షల కప్పుల టీని.. 74.32 లక్షల కాఫీ ఆర్డర్లు తమకు వచ్చినట్లుగా పేర్కొంది.