అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా!

కాగా.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. అది నేటితో ముగిసింది.

Update: 2024-12-27 07:37 GMT

'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. ఆ గడువు నేటితో ముగియనుంది. ఈ సమయంలో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా... నేడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. వాస్తవానికి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో నేరుగా హాజరవ్వాల్సి ఉండగా.. ఆన్ లైన్ ద్వారా హాజరవుతారని ఆయన తరుపు న్యాయవాదులు కోర్టును కోరడంతో.. అందుకు న్యాయమూర్తి అనుమతించారు.

ఈ నేపథ్యంలో... నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. అయితే... ఈ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. దీంతో.. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు సోమవారం (డిసెంబర్ 30) కి వాయిదా వేసింది.

కాగా.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. అది నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలూ చేశారు.

Tags:    

Similar News