నాగార్జున పరువు నష్టం కేసు... మంత్రి సురేఖకి కోర్టు షాక్
తెలంగాణ మంత్రి కొండ సురేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే.
తెలంగాణ మంత్రి కొండ సురేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేశారు. నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు ఇరు వైపుల వినిపిస్తున్నారు. ఈ కేసు ముందుకు వెళ్లాలంటే మంత్రి కొండ సురేఖ స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయడం జరిగింది. కోర్టు సమన్లు జారీ కావడంతో డిసెంబర్ 12వ తారీకు మంత్రి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు లాయర్ కోరినా కోర్టు తీరస్కరిస్తూ సురేఖ కి షాక్ ఇవ్వడం జరిగింది.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంతలపై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో మంత్రి కొండ సురేఖ పై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే కేటీఆర్, నాగార్జున కోర్టుకు హాజరు అయ్యి తమ వాంగ్మూలంను రికార్డ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా మంత్రి హాజరుకు సంబంధించిన చర్చ జరుగుతోంది. కోర్టు మంత్రి వ్యక్తిగత హాజరు మినహాయింపును కొట్టివేస్తూ తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశించడం జరిగింది. డిసెంబర్ 12న కోర్టుకు మంత్రి హాజరు కావాల్సి ఉండగా ఆమె నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనేది చూడాలి.
కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకుంటే మంత్రి సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును నాగార్జున కోరడం జరిగింది. నాగార్జున పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా సురేఖ హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడం జరిగింది. సురేఖపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు చెప్పాలి అంటూ నాగార్జున తరపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే సురేఖ తన వ్యాఖ్యలపై ఎక్స్ ద్వారా క్షమాపణలు చెప్పారని, మీడియా ముందు కూడా ఆమె తన వ్యాఖ్యలు ఎవరికి అయినా ఇబ్బందిని కలిగించి ఉంటే క్షమించాలని కోరారు అంటూ ఆమె తరపు లాయర్ కోర్టుకు తెలియజేయడం జరిగింది.
ఒక వైపు అక్కినేని ఫ్యామిలీ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటీషన్ కారణంగా వార్తల్లో ఉంది. మరోవైపు అక్కినేని ఫ్యామిలీ మొత్తం నాగ చైతన్య, శోభిత పెళ్లి హడావిడిలో ఉంది. ఇటీవలే నాగార్జున, శోభిత యొక్క మంగళ స్థానాలు జరిగాయి. హల్దీ వేడుక వైభవంగా జరిగిందని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలు, వీడియోలను చూస్తే అర్థం అవుతుంది. నాగ చైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకోవడం జరిగింది. బాలీవుడ్ సినిమాలో పాటు సౌత్‌లోనూ నటించి మెప్పించిన శోభిత దూళ్లిపాళతో చైతూ వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరగబోతున్న విషయం తెల్సిందే.