.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ఏపీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

ఏపీ మాజీ సీఎం జగన్ ఎల్లో మీడియా అంటూ కొన్ని ఛానెళ్ల పేర్లను బహిరంగ సభల్లో సైతం ప్రస్తావించి విమర్శించిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-26 09:18 GMT

ఏపీ మాజీ సీఎం జగన్ ఎల్లో మీడియా అంటూ కొన్ని ఛానెళ్ల పేర్లను బహిరంగ సభల్లో సైతం ప్రస్తావించి విమర్శించిన సంగతి తెలిసిందే. అవన్నీ టీడీపీ అనుకూల సంస్థలని వాటిపై ముద్ర వేశారు. అంతే కాకుండా కొన్ని చానెళ్ల ప్రసారాలు నిలిపివేసేలా ఎమ్మెస్వోలపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆ సంస్థల యాజమాన్యాలు ఈ విషయంపై కోర్టును ఆశ్రయించడంతో ఎంఎస్ వోలు తిరిగి ప్రసారాలు ప్రారంభించాయి. ఇక, తాజాగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో వైసీపీ అనుకూల చానెళ్లుగా ముద్రపడ్డ కొన్ని చానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి.

సాక్షితో పాటు జగన్ సర్కార్ కు అనుకూలంగా ప్ర‌సారాలు చేశాయని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎన్టీవీ, టీవీ9, మ‌రికొన్ని చానెళ్ల ప్రసారాలను ఈ నెల 8వ తేదీ నుంచి ఎంఎస్వోలు నిలిపివేశారు. అయితే, ఈ చానెళ్లను కేబుల్ టీవీ ఆప‌రేట‌ర్లు ఆపివేసిన వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉందా లేదా అన్నది బహిరంగంగా వెల్లడి కాలేదు. దీంతో, ఆయా చానెళ్ల యాజ‌మాన్యాలు తమ చానెళ్లు నిలిపివేశారలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించాయి. ఆ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోక్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Read more!

భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు భంగం క‌లుగుతున్న పక్షంలో ఏపీ ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని ఢిల్లీ హైకోర్టు ప్ర‌శ్నించింది. త‌క్ష‌ణ‌మే ఆ చానెళ్లిను నిలిపివేసినవారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్రబాబు సర్కార్ ను ఆదేశించింది. అంతే కాకుండా, నిలిపివేసిన చానెళ్ల ప్ర‌సారాల‌ను కొన‌సాగించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అనేక మాధ్య‌మాల్లో వార్త‌లు వినే హ‌క్కు ప్రజలకుందని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేర‌ని కామెంట్స్ చేసింది. నిలిపివేసిన చానెళ్లను తక్షణమే పునరుద్ధరించాలని 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది. మరి, ఈ నేపథ్యంలో ఎంఎస్వోలపై ఏపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News