కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యాజ్యంలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!

అవును... ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే.

Update: 2024-02-20 05:34 GMT

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హట్ టాపిక్ గా నిలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు అంశం! ఈ ప్రాజెక్ట్ పై అధికార, విపక్షాల మధ్య అసెంబ్లీ లోపలా, బయటా కూడా భారీ ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది. ఈ ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరిగిందని.. లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని అంటున్నారు! ఈ సమయంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సమయంలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అవును... ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ప్రజాప్రయోజన వ్యాజ్యం వెనుక ఎవరున్నారో తెలుస్తోందంటూ పిటిషనర్‌ ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యమా.. ప్రచార ప్రయోజన వ్యాజ్యమా..? అనే కామెంట్స్ కూడా చేసింది.

ఇదే సమయంలో... పిటిషనర్‌ హోదాను "సీనియర్‌ న్యాయవాది" అని పేర్కొనడంపైనా ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. సీనియర్‌ హోదాకు సంబంధించి హైకోర్టు నోటిఫై చేయకుండానే అలా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే.. కేవలం సర్వీసు ఆధారంగా సీనియర్‌ అనే అపోహ సరికాదని వెల్లడించింది. ఈ పిటిషన్‌ ను పరిశీలిస్తే... దీని వెనుక ఎవరున్నారనేది తెలుస్తోందని వ్యాఖ్యానించింది.

కాగా... కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలపై హైపవర్‌ కమిటీతో విచారణ జరిపించే విధంగా... ఇదే సమయంలో మేఘా, ఎల్ & టీ సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమర్పించే విధంగా... డీపీఆర్‌ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ... విశ్వనాథరెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ లతో కూడిన ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ఈ సమయంలో... పిటిషనర్‌ తరఫు న్యాయవాది నందిత వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్‌ పై విచారణ నిమిత్తం ఒక తేదీని నిర్ణయించాలని కోరారు. ఈ సమయంలోనే జోక్యం చేసుకుంటూ స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా... పిటిషనర్‌ హోదా ఏమిటి, అందుకు సంబంధించిన సంబంధించిన పత్రాలు ఏవి అని ప్రశించిందే. ఈ సమయంలో... ఈ పిటిషన్‌ ను పరిశీలిస్తే దీని వెనుక ఎవరున్నారనే విషయం తెలుస్తోందని.. పూర్తి విచారణలో దాన్ని కూడా తేలుస్తామని.. ఇదే క్రమంలో పిటిషనర్‌ హోదాను సవరించాలనిని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News