సుప్రింకోర్టు ఆదేశాలు అమలు సాధ్యంకాదా ?
ఢిల్లీ ప్రభుత్వం విషయంలో సుప్రింకోర్టు జారీచేసిన ఆదేశాలు అమలు సాధ్యమయ్యేట్లు కనబడటంలేదు.
ఢిల్లీ ప్రభుత్వం విషయంలో సుప్రింకోర్టు జారీచేసిన ఆదేశాలు అమలు సాధ్యమయ్యేట్లు కనబడటంలేదు. ఢిల్లీ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ కమీషన్ ఛైర్మన్ (డీఇ ఆర్సీ) నియామకంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్-లెఫ్ట్ నెంట్ జనరల్ (ఎల్జీ) ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఫైనల్ చేసుకోవాలని సుప్రింకోర్టు ఆదేశించింది.
అదేదో ముతక సామెత ఆయనే ఉంటే మంగలితో పనేముందని అన్నట్లుగా ఉంది సుప్రింకోర్టు ఆదేశం. సీఎం-ఎల్జీ కూర్చుని మాట్లాడేంత సీనుంటే అసలు వివాదం ఎందుకు రేగుతుంది.
ఏ విషయం అయినా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గబ్బుపట్టించటమే ఏకైక టార్గెట్ గా ఎల్జీ సక్సేనా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ సమస్య కేజ్రీవాల్-ఎల్జీ కానేకాదు. కేజ్రీవాల్ సమస్యంతా నరేంద్రమోడీయే అన్న విషయం అందరికీ తెలుసు.
మోడీ తాను తెరవెనుక ఉండి ముందు ఎల్జీని పెట్టి వ్యవహారం నడుపుతున్నారు. ఎల్జీ వ్యవహార శైలిని ఢిల్లీ హైకోర్టు, సుప్రింకోర్టులు గతంలో తప్పు పట్టినా తన పద్దతిని మార్చుకోలేదు. కారణం ఏమిటంటే మోడీ ప్రోత్సాహం ఉండటమే.కేజ్రీవాల్ ను దెబ్బకొట్టడమే మోడీ ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారు.
అందుకనే సక్సేనాను ముందుపెట్టి ప్రభుత్వాన్ని బాగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయం సుప్రింకోర్టుకూ బాగా తెలుసు. డీఇఆర్సీ నియామకంలో కూడా కేజ్రీవాల్ నిర్ణయాన్ని ఎల్జీ అంగీకరించటంలేదు.
ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే నిర్ణయాధికారం ఉంటుందని గతంలో సుప్రింకోర్టు చెప్పినా మోడీ ఒప్పుకోవటంలేదు. అందుకనే ఢిల్లీ ప్రభుత్వం అధికారాల్లో కోత విధించే బిల్లును మోడీ ప్రభుత్వం వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడుతోంది.
ఈ విషయాలన్ని తెలిసి కూడా సుప్రింకోర్టు సీఎం-ఎల్జీని కూర్చుని మాట్లాడుకోమని చెప్పటంలో అర్ధంలేదు. 20వ తేదీలోగా తనకు సమాచారం ఇవ్వాలని సుప్రింకోర్టు ఆదేశించింది. తన నిర్ణయంపై సుప్రింకోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తే మొదటికే మోసం వస్తుందన్న భయం ఉంటే తప్ప ఎల్జీ పద్దతిగా దిగిరారు.
ఇక్కడ సమస్య ఎల్జీ కానేకాదు అంతా మోడీయే. డీఈఆర్సీ గా ఎల్జీ నియమించిన అలహాబాద్ మాజీ జస్టిస్ ఉమేష్ కుమార్ ను కేజ్రీవాల్ వ్యతిరేకిస్తున్నారు. నిర్ణయాధికారం ప్రభుత్వానికే ఉండాలని వాదిస్తున్నారు. మరి 20వ తేదీలోగా ఏమి జరుగుతుందో చూడాలి.