ఆకుపచ్చ కోకలో టపాసులా పేలిన దిశా
దీపావళికి టపాసులు పేల్తాయో లేదో కానీ ఇక్కడ బాలీవుడ్ అందగత్తెలు చుంచుబుడ్డుల్లా మతాబుల్లా లైట్నింగ్ కాంతులతో వెలుగుతున్నారు.
దీపావళికి టపాసులు పేల్తాయో లేదో కానీ ఇక్కడ బాలీవుడ్ అందగత్తెలు చుంచుబుడ్డుల్లా మతాబుల్లా లైట్నింగ్ కాంతులతో వెలుగుతున్నారు. పార్టీ ఎక్కడ ఉన్నా అక్కడ భామల సందడి మామూలుగా లేదు. అయితే పార్టీలో ఎందరు ఉన్నా కళ్లన్నీ దిశా పటానీ వైపే. ప్రముఖ సెలబ్రిటీ వేడుకల్లో దిశా సందడి మామూలుగా లేదు. బాలీవుడ్ లో అగ్ర కథానాయికలు, నటవారసురాళ్లు ఈ పార్టీల్లో సందడి చేస్తున్నా కానీ దిశా పాటానీ కనిపించిందంటే ఇక చూపులన్నీ అటువైపే తిరిగిపోతున్నాయ్.
అంతగా ప్రత్యేకమైన లుక్ తో దిశా పటానీ కనిపిస్తోంది. ఇటీవల వరుసగా బాలీవుడ్ ప్రముఖుల దీవాళి బాష్ లో దిశా పటానీ తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పుడు మరోసారి పార్టీలో పచ్చ చీరలో తళుక్కుమని మతులు చెడగొట్టింది. లేడీ డైనమిక్ నిర్మాత ఏక్తా కపూర్ వార్షిక దీపావళి పార్టీలో దిశా పటానీ మోడ్రన్ అప్సరలా కనిపించింది. అందంగా పూత పూసిన ఫారెస్ట్ గ్రీన్ చీర .. దానితో దిశా మార్క్ హాల్టర్ మైక్రో బ్లౌజ్ ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి. సాదా ఆకుపచ్చ చీర- బంగారు వర్ణం డిజైనర్ అంచుతో ఎంతో అందంగా కనిపించింది. దిశా రకరకాల భంగిమల్లో ఫోటోషూట్ కి ఫోజులిచ్చింది.
ఇంతకుముందు మనీష్ మల్హోత్రా హోస్ట్ చేసిన దీపావళి పార్టీలో ఒక స్లింకీ కాంస్యం రంగు చీరను ధరించిన దిశా పటానీ డిజైనర్ సేకరణ నుండి సీక్విన్డ్ చీరలో తళుక్కుమంది.ఈ సంవత్సరం ప్రారంభంలో అంబానీ నివాసంలో గణేష్ చతుర్థి వేడుకల కోసం మైక్రో బ్లౌజ్‌తో ముదురు షాంపైన్ శాటిన్ చీరలో కనిపించి మైమరిపించింది. దిశా పటానీ పండుగ చీరలు ఈ సీజన్లో స్పెషల్ స్పార్క్ ని ఆవిష్కరించాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... దిశా మరోసారి తన మాజీ టైగర్ ష్రాఫ్‌తో జతకట్టబోతున్నట్లు సమాచారం. దర్శకనిర్మాత జగన్ శక్తి తదుపరి చిత్రం `హీరో నంబర్ 1`లో వీరిద్దరూ నటిస్తున్నారు. మొదట్లో సారా అలీ ఖాన్‌ను ఈ పాత్రకు ఎంపిక చేశారు. కానీ సారా స్థానంలో దిశా వచ్చి చేరింది. ఈ మార్పుపై దర్శకుడు జగన్ శక్తి స్పందిస్తూ “దిషా చాలా ఫిట్ ..యాక్షన్ చేయడానికి తగిన నటి. సారా కచ్చితంగా ఈ సినిమాలో భాగమే, కానీ దురదృష్టవశాత్తు కాల్షీట్లతో అడ్జస్ట్ కాలేకపోయాం`` అని తెలిపారు. హీరో నంబర్ 1లో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కజిన్ పష్మీనా రోషన్ టైగర్ ప్రేమికురాలిగా నటించనుంది. ఈ ప్రాజెక్ట్ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన హీరోనం.1 కి సీక్వెల్ కాదని తెలిసింది. 1997లో గోవింద-నటించిన చిత్రానికి రీమేక్ లేదా సీక్వెల్ కాదు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన `యోధా` విడుదలకు సిద్ధమవుతోంది.