ఊర్వశి లెదర్ ప్రాక్ కి ఎయిర్ పోర్ట్ జామ్!
ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లోనూ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా రచ్చ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లోనూ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా రచ్చ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి ఆల్ట్రా మోడ్రన్ ఎలివేషన్లకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్లేస్ ఎలాంటిదైనా అక్కడ ఊర్వశి మార్క్ పడాల్సిందే అంటుంది. తాజాగా ఊర్వశి లెదర్ ప్రాక్ అందాలకి ఎయిర్ పోర్ట్ మొత్తం జామ్ అయింది. అమ్మడు ఇలా కారు దిగి ఎయిర్ పోర్ట్ లో కి అడుగు పెట్టింది.
దీంతో ఎవరీ బ్యూటీ అంతా అక్కడున్న వారంత తన్మయం చెందారు. కళ్లర్పకుండా అంతా చూస్తూనే ఉన్నారు. లెదర్ ప్రాక్ ధరించి..కళ్లకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని అలా వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంటే! వెంబడించే అవకాశం లేకపోయింది గానీ..లేదంటే ఊర్వశి వెంట పడేవారేమో. వాళ్ల ఎగ్జైట్ మెంట్ ని గమనించిన అమ్మడు ప్లైయింగ్ కిస్సులు విసిరింది. దీంతో ఊర్వశి మరోసారి ట్రోలింగ్ గురైంది.
ఎయిర్ పోర్టుకి ఇలాంటి డ్రెస్ లు వేసుకుని రావాలా? పబ్లిక్ ప్లేస్ ల్లోకి ఇలాంటి దుస్తుల్లో వస్తే చుట్టూ ఉన్న వారికి ఎంత ఇబ్బంది! ఇది తమాషాలు చేయడానికి ఇలాంటి బట్టలేసుకొస్తారా? అంటూ కొందరు నెటి జనులు మండిపడుతున్నారు. అటుపై ట్రోలింగ్ మొదలైంది. అలాగని ఊర్వకి సపోర్ట్ చేసే వారు లేకపోలేదు. అమ్మడి దుస్తుల్లో మరీ అంత వల్గరిటీ లేదని...లెదర్ ప్రాక్ వేసుకురావడం కూడా తప్పేనా? అంటూ మద్దతిస్తున్నారు.
ఊర్వశి రౌతేలా మిగతా కొంత మంది హీరోయిన్లకంటే చాలా పద్దతిగా ఉంటుంది. తొడ పిక్కలు కనిపించేలా? ఎంద అందాలు ఎయిర్ పోర్టుల్లో ఆరబోసిన భామలు చాలా మంది ఉన్నారు. వాళ్లందర్నీ వదిలేసి ఊర్వశి మీదనే ఈ అసూయ ఎందుకంటూ ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పాజిటివ్ ..నెగిటివ్ కామెంట్లపై ఉర్వశి ఏమంటుందో.