బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి దేశం విడిచి వెళ్లిపోయాడు విజయ్ మాల్యా. రెండేళ్ల కిందటే లండన్ చెక్కేసిన మాల్యా ఇప్పటిదాకా ఇటువైపు చూడలేదు. అతడిని రప్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బ్యాంకులతో పాటు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ ఎల్)ను కూడా మాల్యా మోసం చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా మాల్యా టోకరా ఇచ్చినా సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెంగళూరు ఫ్రాంఛైజీని నడిపే రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ సీఎస్పీఎల్)లో విజయ్ మాల్యా సుమారు రూ.115 కోట్ల మేరకు ఆర్థిక అవకవతకలకు పాల్పడినట్లు తాజాగా వెల్లడైంది. తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థలకు సమర్పించిన ఆర్థిక నివేదికలో ఈ విషయం తేలింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిటింగ్ జరపగా మాల్యా భారీ మొత్తానికి టోకరా వేసినట్లు వెల్లడైంది. మాల్యా తెలివిగా రూ.115 కోట్ల మొత్తాన్ని సంస్థ నుంచి తన వ్యక్తిగత ఖాతాకు నిధులు మళ్లించుకున్నట్లు తెలుస్తోంది.
యుఎస్ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్.. సీఈవో సారథ్యంలోని బృందం 2016 జూలైలో చేపట్టిన అంతర్గత విచారణ సందర్భంగా ఆర్ సీఎస్పీఎల్ నుంచి పెద్ద మొత్తంలో నిధులను మళ్లించినట్లు తేలింది. ప్రస్తుతం యుఎస్ఎల్.. బ్రిటిష్ బేవరేజ్ కంపెనీ డియాజియో చేతుల్లో ఉంది. ఆర్‌సీఎస్పీఎల్‌లో డియాజియో అతి పెద్ద వాటాదారుగా ఉంది. మాల్యా నుంచి యునైటెడ్ స్పిరిట్స్‌ను 2014లో డియాజియో కొనుగోలు చేసిన అనంతరం కంపెనీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ చేపట్టింది. 2010 అక్టోబరు నుంచి 2014 జూలై మధ్య కాలంలో మాల్యా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్టు తేలింది.