అడ్డంగా దొరికిపోయిన చైనా.. 10 మంది గూఢాచారుల్ని అరెస్టు.. ఫోన్ కాల్ తో రిలీజ్

Update: 2021-01-04 12:30 GMT
కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. ప్రపంచం ఆశ్చర్యపోయేలాంటి ఈ ఉదంతంలో డ్రాగన్ దుర్మార్గం ఎంతలా ఉంటుందన్న విషయం మరోసారి బయటకు వచ్చింది. ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లో గత డిసెంబరులో చైనాకు చెందిన పది మంది గూఢాచారుల్ని అరెస్టు చేశారు. అనంతరం సీన్లోకి వచ్చిన డ్రాగన్ దేశం.. వారిని తమ దేశానికి తిరిగి పంపాల్సిందిగా కోరిన వైనం బయటకు వచ్చింది. చైనా వినతితో వారిని విడుదల చేసి..ప్రత్యేక విమానంలో తిరిగి చైనాకు పంపినట్లుగా చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారం రహస్యంగా సాగింది. అనుకోని రీతిలో ఈ విషయం మీడియాలో వెల్లడి కావటంతో బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో చైనా తమకు క్షమాపణలు చెప్పాలని ఆఫ్ఘాన్ ప్రభుత్వం పట్టుబట్టిందని..లేదంటే నిందితులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందని చెబుతున్నారు. అయితే.. చైనా చర్చలు జరిపిన అనంతరం వారిని తమ దేశానికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

ఆఫ్గాన్ లో పట్టుబడిన పది మంది చైనా గూఢాచారుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాల్ని.. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. వీరికి చైనా గూఢాచార సంస్థతో సంబంధాలు ఉన్నాయని.. వీరు ఆఫ్ఘాన్ లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే ప్రయత్నం చేసినట్లుగా ఆ దేశం గుర్తించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇష్యూలో ఉన్న సున్నిత అంశాల కారణంగా చైనా గూఢాచారుల్ని విడుదల చేశారని చెబుతున్నారు.




Tags:    

Similar News