ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల నుంచి 10మంది కరోనా రోగులు పరారయ్యారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ వారంతా తప్పించుకోవడంతో ఎవరికి అంటిస్తారేమోనన్న భయం వెంటాడుతోంది.
తమను ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇక్కడే ఉంటే చనిపోతామనే భయంతో 10మంది కరోనా రోగులు తప్పించుకుపోయారని తెలిసింది.
రిమ్స్ లో సౌకర్యాలు లేవని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే రిమ్స్ సెక్యూరిటీ, సిబ్బంది, వైద్య సిబ్బంది అస్సలు పట్టించుకోవడం లేదని వెలుగుచూసింది. మెరుగైన వైద్య సేవలు, సౌకర్యాలు లేకపోవడంతోనే వీరంతా పరార్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక తప్పించుకున్న వారిలో ముగ్గురిని గుర్తించి తిరిగి రిమ్స్ కు తరలించారు. ఒకరిని హోం ఐసోలేషన్ లో ఉంచేందుకు అనుమతిచ్చారు.
కాగా రిమ్స్ నుంచి తప్పించుకున్నారన్నది అవాస్తవమని.. వారంతా పండుగ కోసం వెళ్లారని.. తిరిగి వచ్చారని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ తెలిపారు.
ఇక రిమ్స్ లో వైద్యఖాళీల భర్తీకి ఇక్కడి వైద్యులే అడ్డుపడుతున్నారని రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిమ్స్ లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి లేఖ రాసినా వైద్యులు వద్దంటున్నారని.. రాజకీయ నేతలతో కలిసి రిక్రూట్ మెంట్లు ఆపేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రిమ్స్ లో పరిస్థితులు అద్వానంగా ఉన్నాయని తెలుస్తోంది.