ఐదేళ్లలో 10 కోట్ల లక్షల రుణాలకు రైటాఫ్.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి..!

Update: 2022-12-13 13:30 GMT
పేద.. మధ్యతరగతి.. చిన్న వ్యాపారులు.. విద్యార్థులకు రుణాలు ఇవ్వడానికి ఏమాత్రం మనస్సు రాలేదు. సవాలక్ష కారణాలతో బ్యాంకులు చుట్టూ పది సార్లు తిప్పించుకొని అర్హతల పేరుతో కొంతమందికి మాత్రమే రుణాలు మంజూరు చేస్తాయి. ఇక వీరి రుణాల వసూళ్లలో బ్యాంకులు చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇళ్లు పీకి పందిరి వేయడమే తక్కువ అన్నట్లుగా నానా హంగామా చేస్తుంటారు బ్యాంక్ సిబ్బంది.

అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు బ్యాంకులన్నీ కూడా బడా బాబులకు ఏటీఎం మాదిరిగా పని చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఫార్మాలిటీ పేరుతో కొన్ని పత్రాలను తీసుకొని వేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నాయి. ఆ తర్వాత వీటిని మొండి బకాయిల పేరుతో రైటప్ చేస్తూ బడా బాబులను రుణాల నుంచి విముక్తి కనిపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

అయితే బ్యాంక్ అధికారుల కమిషన్ల పేరుతో పెద్ద మొత్తంలో బడాబాబుల నుంచి డబ్బులు తీసుకొని వారి నుంచి తిరిగి రుణాలు వసూలు చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా గడిచిన ఐదేళ్లలో 10 లక్షల 9వేల 511 కోట్ల మేర మొండి బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గతంలోనూ బ్యాంకులు పలుసార్లు లక్షల కోట్ల రుణాలను  రైటప్ చేసి విజయ్ మల్యా లాంటి బడా బాబులకు ఊరట కల్పించాయి. నాలుగేళ్ల కాలంలో మొండి బకాయిలుగా ఉన్న రుణాలను బ్యాంకులు రైటప్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ రుణాలను రైటప్ చేసినప్పటికీ తిరిగి రివకరీ చేయనున్నట్లు ప్రకటించారు. గడిచిన ఐదేళ్లలో 1.32 లక్షల కోట్లు సహా మొత్తం 6.59 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రికవరీ చేసినట్లు వెల్లడించారు.

అయితే మొండి బకాయిలు రికవరీ కాకపోవడానికి బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నిర్ధారణ అయిందన్నారు. గత ఐదేళ్లలో 3వేల 312 మంది బ్యాంకు అధికారులను మొండి బకాయిలకు జవాబుదారీగా చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏది ఏమైనా బ్యాంకులు మాత్రం బడా బాబుల విషయంలో ఒకలా.. సామాన్యుల విషయంలో మరోలా వ్యవహరిస్తున్న బ్యాంకులకు ‘జోహర్లు’ అర్పించాల్సిందేనంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News