దేశంలో రాజకీయ ప్రముఖులకు.. మరికొందరు ముఖ్యులకు జెడ్.. వై కేటగిరి భద్రత కల్పించటం మామూలే. కానీ.. ఒక వ్యాపార ప్రముఖుడికి ‘జెడ్’ కేటగిరి రక్షణ కల్పించటం అన్నది దేశంలో కొన్నేళ్ల క్రితం వరకూ లేదు. కానీ.. కొద్దికాలంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి ప్రభుత్వ పరంగా జెడ్ కేటగిరి రక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వపరంగా వీవీఐపీ భద్రత పొందుతున్న ఏకైక వ్యక్తిగా ముకేశ్ అంబానీని చెప్పొచ్చు.
తాజాగా.. ఆయన సతీమణి నీతూ అంబానీ రక్షణ విషయంలో ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ఆమెకు ‘వై’ కేటగిరి రక్షణ కల్పించాలని నిర్ణయించారు. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమెతో పాటుగా సాయుధులైన పది మంది సీఆర్ పీఎఫ్ కమాండోలు ఆమె వెంట ఉంటారు. ఆమెకు నిత్యం రక్షణ కల్పిస్తుంటారు. దేశంలో మరే ప్రైవేటు వ్యక్తులకు ఇలాంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించకపోవటం గమనార్హం.
జాతీయ భద్రతా సంస్థ ఇచ్చిన థ్రెట్ అసెస్ మెంట్ నివేదికలో నీతూ అంబానీకి ప్రత్యేక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని పేర్కొనటంతో పాటు.. ఆమెకు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ నుంచి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీతూకు ‘వై’ కేటగిరి భద్రతను కల్పించనున్నారు. దీంతో ముకేశ్ కు ‘జెడ్’ కేటగిరి రక్షణ కాగా.. ఆయన సతీమణి నీతూకు ‘వై’ కేటగిరి రక్షణ కల్పిస్తారు.