ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తోంది. అమెరికాలో ఒక్కరోజే 10లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. గత గురువారం నాటి 5.81 లక్షలకు ఇవి దాదాపు రెట్టింపు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రికార్డు స్థాయి కేసులతో ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. చాలా రంగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ షట్ డౌన్ అంచున ఉంది. వేలాదిగా విమాన సర్వీసులు రద్దవుతున్నాయి.
ఇక నూతన సంవత్సర వేడుకలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపించాయి. కొత్త కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 10.42 లక్షల కేసులు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 5.81లక్షల పాజిటివ్ లు వెలుగుచూశాయి. ఇక గత వారంలో ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరు వైరస్ బారినపడ్డారు. కేసులు పెరుగుతుండటంతో అమెరికాలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం లక్షకు పైగా కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలో ఉన్నవారి సంఖ్య 18వేలకు పైనే. 2021 జనవరిలో అత్యధికంగా 1.42లక్షల మంది ఆసుపత్రి పాలవ్వగా..
ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో చేరికలు ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో 5.5 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. అమెరికా జనాభా 35 కోట్లు . అంటే దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా సోకింది. ఇక ఇప్పటివరకు 8.26లక్షలకు పైగా మందిని మహమ్మారి బలితీసుకున్నట్లు జాన్ హాప్కిన్స్ డేటా వెల్లడించింది. మరోవైపు అగ్రరాజ్యంలోఇప్పటివరకు 62శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరికి బూస్టర్ పంపిణీ చేస్తున్నారు.
ఇక అమెరికాలో ఈ దఫా ఉద్ధృతి చిన్నారులపై ప్రభావం చూపిస్తోంది. ప్రతి రోజూ 500 కంటే ఎక్కువ మంది పిల్లలు వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికే అక్కడ 12ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా.. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టీకా పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు 12-15 ఏళ్ల వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం అనుమతినిచ్చింది. ఈ వయసు వారికి రెండో డోసు తీసుకున్న 5-6 నెలల తర్వాత బూస్టర్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే దీనిపై సీడీసీ నుంచి ఇంకా అనుమతులు రాలేదు.
ఆస్ట్రేలియాలో 30 వేల కేసులు
కరోనా రెండు వేవ్ లను కట్టడి చేసిన ఆస్ట్రేలియా ఇప్పుడు అల్లాడుతోంది. రోజుకు అక్కడ 30 వేల కేసులు వస్తున్నాయి. అసలే తక్కువ జనాభా ఉండే దేశంలో కేసులు 30వేలంటే మాటలు కాదు. సిడ్నీ, మెల్బోర్న్ వంటి నగరాల్లో ఇప్పుడిప్పుడే ప్రజా జీవనంపై ఆంక్షలు తొలగుతున్నాయి. ఈలోగానే మళ్లీ కేసులు పెరుగదలతో ఆందోళన నెలకొంది. ఇక బ్రిటన్ లో కేసులు లక్షకు తగ్గడం లేదు. లాక్డౌ న్ ఆంక్షలు మాత్రం అమలు యోచన లేదని ప్రభుత్వం చెబుతోంది.
మన దేశంలో మళ్లీ 30 వేలపైనే.. ఢిల్లీలో రెడ్ అలర్ట్
మన దేశంలో గత నెల 27న 6,300 కేసులు.. సోమవారం 37,000..! 8 రోజుల్లోనే పాజిటివ్ రేటు 0.61 నుంచి 4కు పెరిగింది. వరసగా రెండో రోజూ పాజిటివ్ రేటు 5పైనే ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించడంతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేస్తారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూ కరోనా సోకింది. దేశ రాజధానిలో మూడు రోజుల్లోనే 10వేల కేసులు వచ్చాయి. ఈ వారం చివరినుంచి వారాంత కర్ఫ్యూ అమలుచేయనున్నారు. ముంబైలో ఇప్పటికే నెలాఖరు దాక పాఠశాలలను మూసివేశారు. కర్ణాటక సీఎం బొమ్మై మాటల ప్రకారం చూస్తే.. బెంగళూరులోనూ కఠిన చర్యలు తప్పవని తెలుస్తోంది. గోవాలో పాజిటివ్ రేటు 26కు చేరడం ఆందోళన రేపుతోంది.