చదువుకి దూరంగా 10 లక్షల మంది!
దేశంలో కరోనా విజృంభణ కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డ విషయం తెలిసిందే. అయితే, కొన్ని రోజుల తరువాత కొన్ని విద్యాసంస్థలు స్టూడెంట్స్ భవిష్యత్ కోసం ఆన్లైన్ లో క్లాసులు చెప్పడం ప్రారంభించారు. అయినప్పటికీ కూడా తెలంగాణలో చదువుతున్న లక్షల మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం చదువుకు దూరమయ్యారు. కార్పొరేటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్ ఈ, మరికొన్ని రాష్ట్ర విద్యాశాఖ గుర్తింపు ఉన్న ప్రైవేటు పాఠశాలలు జూన్ నుంచే ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాయి. వాటిలో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది ఉన్నత, మధ్యతరగతి పిల్లలే ఉంటారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబరు 1 నుంచి వారానికి అయిదు రోజులపాటు టీవీల ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందల చిన్న ప్రైవేటు పాఠశాలల్లో చదివే పేద, దిగువ మధ్యతరగతి, కొందరు మధ్యతరగతి పిల్లలకు మాత్రం పాఠాలు చేరడం లేదు. ఈ పాఠశాలలకు ఆన్ లైన్ విద్య అందించే స్థోమత లేకపోవడం.. ఒకవేళ యాజమాన్యాలు ముందుకొచ్చినా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న కారణంగా నాలుగు నెలలుగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకు చదువు దూరం అయింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జులై నాటికి 60-70 శాతం ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి. 15-30 రోజులపాటు రోజుకు దాదాపు రెండు గంటలు తరగతులు నడిపిన అనంతరం ఫీజులు అడగడంతో ఫీజులు చెల్లించేందుకు చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడలేదు. కొన్ని యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే ఆన్ లైన్ లింకు ఇస్తామని తేల్చిచెబుతున్నాయి. ఫీజుల కోసం ఫోన్లు చేస్తుండటంతో చాలామంది ఆన్ లైన్ చదువుకు మొగ్గు చూపడం లేదు. కొన్ని పాఠశాలల్లో నెల రోజుల్లోనే బోధన నిలిపివేశారు. ‘ఆన్ లైన్ లో 50 శాతం కూడా చదువు నేర్చుకోవడం కష్టం. 100 శాతం ఫీజు ఎందుకని ఎక్కువమంది భావిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 11 వేల ప్రైవేట్ పాఠశాలలు ఉండగా వాటిల్లో 32 లక్షల మంది చదువుతున్నారు. ప్రస్తుతం 7 వేల స్కూల్స్ లో ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా .. మరికొన్ని స్కూల్స్ లో ఎలాంటి తరగతులు చెప్పడం లేదు. దీనితో దాదాపుగా తెలంగాణలో 10 లక్షల కి పైగా విద్యార్థులు చదువుకి దూరమైయ్యారు.