రోహిత్ సూసైడ్ నిరసనలో ప్రొఫెసర్ల నిర్ణయం

Update: 2016-01-21 04:53 GMT
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహరం మరింత ముదురుతోంది. ఇప్పటివరకూ పలువురు రాజకీయ నేతలు వచ్చి వెళ్లటం.. డిమాండ్లను వినిపించటం లాంటివి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు కొందరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. యూనివర్సిటీకి చెందిన 10 మంది ప్రొఫెసర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ రోహత్ వ్యవహారంపై రాజకీయ పార్టీలు మాత్రమే స్పందిస్తే.. ఇప్పుడు వర్సటీకి చెందిన పది మంది ప్రొఫెసర్లు తమ రాజీనామాతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందన్న మాట వినిపిస్తోంది. తాజా పరిణామంతో సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత మరింత పెరగనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News