100 ఏళ్లకు ప్రేమ కోసం పరితపించారు..

Update: 2019-07-08 08:01 GMT
ఆ తాతకు 100 ఏళ్లు.. ఆ బామ్మకు ఏకంగా 103 ఏళ్లు. పండు ముదుసలి వారు. అంత వయసులోనూ ప్రేమ కోసం పరితపించారు. మనసులు కలవడంతో ఒక్కటయ్యారు. ఇదీ అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటన. ఒహాయో రాష్ట్రంలోని ఓల్డేజ్ హోమ్ వారిద్దరినీ కలిపింది. ప్రేమ గుడ్డిది అంటారు కానీ దానికి వయసుకు సంబంధం లేదని ఈ వృద్ధ జంట మరోసారి నిరూపించారు. ఆడ, మగ మనసులు కలిస్తే చాలని దానికి వయసుకు తేడా లేదని నిరూపించారు.

100 ఏళ్ల జాన్ కుక్, 103 ఏళ్ల ఫిల్లిస్ కుక్ లు ఓల్డేజ్ హోమ్ లో నివసిస్తున్నారు. ఇద్దరి భాగస్వాములు చనిపోవడంతో వీరిద్దరి మనసులు కలిశాయి. ఏడాది పాటు డేటింగ్ కూడా చేశారు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వయసులో పెళ్లేంటి అని అందరూ ప్రశ్నించినా.. తమ భాగస్వాములను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నామని.. ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి పెళ్లి చేసుకుంటే తప్పంటి అని ప్రశ్నిస్తున్నారు. ఆరోపించే వ్యక్తుల అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని తాము నచ్చినట్టు ఉంటామని వారు చెబుతున్నారు.

ఇలా 100 ఏళ్ల వయసులో చిగురించిన ప్రేమతో వారిద్దరూ ఓల్డేజ్ హోమ్ లోనే ఉంటూ తమ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నారు.


Tags:    

Similar News