ఇందిరాగాంధీ... ఆధునిక భారతదేశ చరిత్రలోని మహిళా నేతల్లో ఆమె స్థానం మిగతా అందరి కంటే భిన్నం. తిరుగులేని నేత అని.. దృఢశాలి అని అభిమానులు కీర్తిస్తే.. నియంత అని, కొడుకు చాటు తల్లి అని విమర్శకులు ఆరోపిస్తారు. ఎవరు ఏ కోణంలోంచి చూసినా భారతదేశానికి ఇంతవరకు ప్రధానిగా పనిచేసినవారిలో ఏకైక మహిళ అయిన ఇందిర శత జయంతి సందర్భంగా ఈ కథనం...
ఇందిరాగాంధీ నిర్ణయాల్లో మన్ననలు పొందినవీ ఉన్నాయి.. మంటలు రేపినవీ ఉన్నాయి. అందుకే ఇప్పటికీ ఆమెను తీవ్రంగా ద్వేషించేవారు, అంతే స్థాయిలో అభిమానించేవారు కనిపిస్తారు. మూడుసార్లు ప్రధాని పదవి చేపట్టిన ఆమె తీసుకున్న నిర్ణయాల్లో నాలుగు నిర్ణయాలు దేశంపై తీవ్ర ప్రభావం చూపాయి. కొన్ని అభివృద్ధి పథానికి తొలి అడుగులైతే.. కొన్ని ప్రజాస్వామ్యానికి తొలిసారి తూట్లు పొడిచిన కత్తులయ్యాయి. 1969లో దేశంలోని 14 ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేస్తూ ఇందిర జారీ చేసిన ఆర్డినెన్స్ ఒక సంచలనం. దేశ ఆర్థిక విధానాల్లో ఇది కీలక మలుపు. ఆ తరువాత 1971లో పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ కు స్వతంత్రం కల్పించినప్పుడు కూడా ఆమెను అంతా కీర్తించారు. కానీ.... 1975లో ఆమె విధించిన ఎమర్జెన్సీ ఇందిర ప్రతిష్ఠకే కాక దేశ చరిత్రకు కూడా నల్లరంగు పులిమింది. అలాగే 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో పంజాబ్‌లో వేర్పాటువాదుల్ని అణచడానికి ఆమె తీసుకున్న నిర్ణయం కూడా సంచలనమే. చివరకు అదే ఆమె మరణానికి దారితీసింది.
అయితే... ఇందిరలో నియంత లక్షణాలే కాదు జాలి, కరుణ కూడా ఉన్నాయంటారు. భక్తీ భావమూ ఎక్కువేనట. అయితే, అధికారం అంటే ఆమెకు ఉన్న ఇష్టం మిగతా ఇష్టాలను డామినేట్ చేసేసేదని చెప్తారు. ‘‘ప్రధానిగా అధికారం కావాలా, సంజయ్ కు తల్లిగా ఉంటావా... ఏదో ఒకటి తేల్చుకో’’ అని భర్త ఫిరోజ్ అన్నప్పుడు ఆమె పిల్లల్ని తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్లిపోయిందని చెబుతుంటారు.ఇందిర తీసుకున్న చర్యలు ఆమె ధైర్యాన్ని చెప్పకనే చెప్తాయి. బంగ్లాదేశ్ కోసం పాక్ తో యుద్ధం సమయంలో స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో ఆమె నిర్ణయాలు సాహసోపేతమైనవే.