తరచూ ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయని లైట్ తీసుకోవద్దు. గతంలో మాదిరి కాకుండా ఈసారి చెబుతున్న మాటలకు శాస్త్రీయత ఉంది. దాదాపు నాలుగేళ్ల క్రితం (2012)లో ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు.. కథనాలు వినిపించాయి. ప్రపంచ వినాసనం ఎలా సాధ్యమో చెబుతూ కొద్దిమంది చాలా మాటలే చెప్పారు. దీనికి కౌంటర్ గా ఆ మాటల్లో నిజం లేదని.. భూమి నిక్షేపంగా ఉంటుందని మరి కొందరు తమ వాదనను వినిపించారు. భయపెట్టినట్లుగా ప్రపంచ వినాశనం చోటు చేసుకోలేదు.
కానీ.. తాజాగా అలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. భూమికి ఎలాంటి భయం లేదని అనుకోవటానికి వీల్లేదని... భూమిని సర్వనాశనం చేసేందుకు రంగం సిద్ధమైందన్న తాజా మాట అందరిని ఉలిక్కిపడేలా చేస్తుంది. చైనాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త చేస్తున్న వార్నింగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భూమి సర్వనాశనం ఎలా అవుతుందన్న ప్రశ్నకు మారి సమాధానం సంతృప్తికరంగా ఉండటమే కాదు.. కొత్త టెన్షన్ ను తెచ్చిపెట్టేలా ఉందనటంలో సందేహం లేదు.
అదెలా అంటే.. సుమారు వెయ్యి ఉల్కలు భూమి వైపు అతి వేగంగా దూసుకొస్తున్నాయని.. వాటి కారణంగా భూమికి తీవ్ర ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. గంటకు 60వేల మైళ్ల వేగంతో దూసుకొస్తున్న ఈ వెయ్యి ఉల్కలు భూమిని టచ్ చేస్తే.. భూమి నామరూపాల్లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వెయ్యి ఉల్కల్లో 2009 ఈఎస్ అనే పేరున్న ఉల్క అతి త్వరలో భూమిని టచ్ చేస్తుందని చైనాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పది మైళ్ల వెడల్పు ఉన్న ఈ అతి పెద్ద అస్ట్రాయిడ్ భూమిని కానీ టచ్ చేస్తే.. దాని కారణంగా వెలువడే శక్తి మూడు బిలియన్ అణుబాంబులతో సమానంగా ఉంటుందని.. దాంతో వినాశనం తప్పదని చెబుతున్నారు.
ఆ అస్ట్రాయిడ్ కానీ భూమిని టచ్ చేస్తే.. భూమి మీదున్న జీవజాలంలో మూడో వంతు తుడిచిపెట్టుకుపోతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి మాటలతో చైనా ఖగోళ శాస్త్రవేత్త వార్నింగ్ ఇస్తుంటే.. మరోవైపు.. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు.. ఈ అస్ట్రాయిడ్ భూమిని ఢీ కొట్టకుండా దాని మార్గాన్ని మార్చే అంశంపై దృష్టి పెట్టారు. భూమిని ఢీ కొట్టకుండా అడ్డుకోవటం ద్వారా.. దీనినుంచి ఎదురయ్యే ముప్పును తప్పించొచ్చని చెబుతున్నారు. నాసా చేపట్టిన ఈ ఆపరేషన్ మీదనే భూమి మనుగడ ఆధారపడి ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే.. ఆందోళన కలిగిస్తున్న 2009 ఈఎస్ ఉల్క.. ఎప్పటికి భూమికి దగ్గరగా వస్తుందన్న అంశంపై స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/