ట్రంప్‌ కు రాఖీలు పంపి మ‌నోళ్లు ప్రేమ పంచుతున్నారు

Update: 2017-08-06 08:25 GMT
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కు రాఖీ అంటే ఏమిటో తెలియక పోవచ్చు కానీ, ఆయన ఈసారి రాఖీ పండుగలో పాల్గొనే అవకాశం ఉంది. మన దేశం నుంచి ఆయనకు రాఖీలు అందనున్నాయి. హర్యానా రాష్ట్రంలోని వెనుకబడిన పాంతమైన మేవాట్‌ లో మారుమూలన ఉన్న ట్రంప్ గ్రామానికి చెందిన విద్యార్థినులు 1001 రాఖీలను ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వాటిపై ట్రంప్ ఫొటోలుంటాయి. తాము పంపే రాఖీలతో భారత- అమెరికాల సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని వారు ఆశిస్తున్నారు.

సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ(ఎస్‌ ఐఎస్‌ ఎస్‌ ఓ) అధినేత బిందేశ్వర్‌ పాఠక్‌ ఇటీవలే ఈ గ్రామానికే ట్రంప్‌ గ్రామం అని పేరు పెట్టారు. దీంతో ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా గ్రామానికి పేరు మార్చారంటూ అధికారులు అభ్యంతరం తెలపటంతో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రంప్‌ గ్రామ సూచిక బోర్డులను తొలగించారు. పున్‌హానా తహశీల్‌ పరిధిలోని ఈ గ్రామ జనాభా 1800లో ఎక్కువ మంది ముస్లిములే. ఎస్‌ ఐఎస్‌ ఎస్‌ ఓ సంస్థ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లను ఈ గ్రామ మహిళలు తమ పెద్దన్నయ్యలుగా భావిస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుకే మోడీ ఫొటోలతో 501 రాఖీలను - ట్రంప్‌ ఫొటోలతో 1001 రాఖీలను తయారుచేసి పంపిస్తున్నారని వివరించారు. గ్రామ మహిళలు కొందరు ప్రధానమంత్రి మోడీని ఆయన నివాసంలో కలిసి రాఖీలు కట్టేందుకు ఢిల్లీ బయలుదేరారని పేర్కొన్నారు.

ఈ గ్రామంలోని 140 నివాసాలకు గాను 45 మాత్రమే టాయిలెట్లు ఉండగా సులభ్‌ సంస్థ మిగతా 95ఇళ్లకు కూడా టాయిలెట్లు నిర్మించి ఇచ్చింది. గ్రామంలోని మహిళలు - బాలికల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. మహిళలపట్ల దురుసుగా వ్యవహరించే ట్రంప్‌ కు రక్షాబంధనం పురస్కరించుకొని ఇంత పెద్ద మొత్తంలో సోదరభావంతో 1001 రాఖీలు పంపటం విశేష‌మ‌ని ప‌లువురు అంటున్నారు.
Tags:    

Similar News