కరోనా జయించిన 101ఏళ్ల వృద్ధుడు..కరోనాపై గొప్ప ముందడుగు

Update: 2020-03-28 08:10 GMT
ప్రపంచ వైద్య చరిత్రలోనే ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఇప్పటివరకు కరోనా ఎక్కువగా 60 ఏళ్లపైన ఉండే వృద్ధులకే సోకుతోంది. వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో మరణాల రేటులోనే ఈ 60 ఏళ్ల పైన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇటలీలో అయితే 70ఏళ్ల పైన వారికి వైద్యం కూడా చేయడం లేదు.

ఇటలీలో ఇప్పటివరకు 86వేల మందికి కరోనా సోకింది. అందులో 10950మంది మాత్రమే కోలుకున్నారు. ఏకంగా 9వేలకు పైగా మరణించారు. కరోనా కట్టడికి ఇటలీ ఎంత ప్రయత్నం చేసినా ఫలితాలు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ఇటలీ దేశంలోనే అద్భుతం చోటుచేసుకుంది. ఇటలీకి చెందిన 101 ఏళ్ల వయో వృద్ఢుడు  కరోనాను జయించి ఆ దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికి ఆశాదీపంగా మారాడు.

మిస్టర్ పి అనే వృద్ధుడికి గత వారం కరోనా వైరస్ సోకింది. 101 ఏళ్లు కావడంతో ఇతడు బతకడం కష్టమనుకున్నారు. కానీ ఆస్పత్రిలో పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్టు డాక్టర్లు తెలిపారు.

60ఏళ్లు పైబడిన వారే కరోనాకు పిట్టల్లా రాలుతున్నారు. ఈ వందేళ్లు నిండిన వ్యక్తి కరోనాను తట్టుకొని నిలబడడంతో వ్యాధిని నయం చేయగలమన్న ధీమా వచ్చిందని ఇటలీ వైద్యులు గర్వంగా తెలుపుతున్నారు. ఇతడి శరీరాన్ని పరీక్షించి కరోనాపై చికిత్సలో ముందుకెళ్తామని అంటున్నారు.ఇతడు కరోనాపై వైద్యంలో ఆశాదీపంలా కనిపిస్తున్నాడని తెలిపారు.


Tags:    

Similar News