కరోనా వైరస్ సోకిందనగానే భయంతోనే సగం చస్తున్నారు జనాలు. భయాందోళనకు గురి అవుతూ గుండెదడకు గురి అవుతున్నారు. అది వస్తే ఇక ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై చాలా మంది భయపడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని 101 ఏళ్ల వృద్ధ మహిళ ఈ వ్యాధిని జయించి కరోనాపై యుద్ధంలో విజయం సాధించింది. ఆమె సంకల్ప శక్తియే ఆమెను బయటపడేసిందని వైద్యులు తెలిపారు. ఏపీలో కరోనావైరస్ కేసులు.. మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న సమయంలో ఈ 101 ఏళ్ల బామ్మ అద్భుతంగా కోలుకోవడం అందరికీ ధైర్యాన్నిచ్చింది.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్విమ్స్) నుండి పాలకూరి మంగమ్మ అనే 101 ఏళ్ల వృద్ధురాలును శనివారం విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నుండి కోలుకున్న అతి పెద్ద రోగిగా ఈమె రికార్డు సృష్టించింది. తిరుపతి నివాసి అయిన ఈమె 10 రోజుల క్రితం పాజిటివ్ గా పరీక్షించిబడింది. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆసుపత్రులలో ఒకటైన స్విమ్స్‌లో చేరింది. చాలా సీరియస్ గా మొదట ఉన్నప్పటికీ మహిళ గొప్పగా కోలుకుంది.
వృద్ధురాలు చికిత్సకు బాగా స్పందించిందని.. ఆమె తన సంకల్ప శక్తితో ఈ వ్యాధిని ఓడించగలిగిందని... ఇది ఖచ్చితంగా చాలా మందికి ప్రేరణ" అని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ రామ్ అన్నారు. ఆమె కోలుకోవడం చాలా మందికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి విల్‌పవర్ చాలా ముఖ్యం. కరోనా పాజిటివ్‌ను పరీక్షించిన తర్వాత చాలా మంది ఆశను కోల్పోతారు. అలాంటి వారందరికీ మంగమ్మ ఒక స్ఫూర్తి" అని డాక్టర్ రామ్ అన్నారు. ఆమె కోలుకున్నందుకు డాక్టర్ రామ్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మ మరియు ఇతర సిబ్బందికి ఆమె బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
ఏప్రిల్‌లో తిరుపతిలోని మరో ఆసుపత్రిలో 85 ఏళ్ల మహిళ కూడా కరోనా నుంచి కోలుకుంది. కరోనా మరణించిన తన కొడుకు నుండి మహిళకు ఈ వ్యాధి సంక్రమించింది.