ఇటలీ నుంచి ఒక మంచి వార్త

Update: 2020-04-06 17:00 GMT
వాస్తవానికి రెండు మంచి వార్తలు అని చెప్పాలి. ఎందుకంటే... రోజు 800 -1000 మరణాల వరకు నమోదు చేసిన ఇటలీ కరోనాతో విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అక్కడ మరణాల రేటు తగ్గుతోంది. ఆదివారం 525 మంది మాత్రమే చనిపోయారు. ఇది మరణాల రేటులో 21 శాతం తగ్గుదల అని ‘ఐఎస్‌ ఎస్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ సిల్వియో బ్రుసఫెర్రో  వెల్లడించారు. ఇక అక్కడ నుంచి వచ్చిన మరో మంచి విషయం మనం తెలుసుకోవాలి. 1918లో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది స్పానిష్ ఫ్లు తో చనిపోయిన విషయం తెలిసిందే. సుమారు 2 కోట్ల మంది మన ఇండియాలోనే చనిపోయారు. అలాంటి భయంకరమైన వ్యాధి నుంచి పసికందుగా ఉన్నపుడు బతికి బట్టకట్టిన ఓ వృద్ధురాలికి తాజాగా కరోనా సోకింది. ఇదేం గుడ్ న్యూస్ అనుకుంటున్నారా... చిన్నపుడే అంత భయంకరమైన వ్యాధిని జయించిన ఆమె తాజాగా 104 సంవత్సరాల వయసులో సోకిన కరోనాను కూడా జయించింది.

కొద్ది రోజుల క్రితం ఉత్తర ఇటలీలోని బియెల్లా పట్టణంలో ఉండే అడ జనుస్సో అనే 104 సంవత్సరాల మహిళకు తీవ్ర వాంతులు - ఊపిరి పట్టేయడం జరిగింది. అయితే, ఆమెకు సొంతంగా ఒక నర్సింగ్ హోం ఉంది. వెంటనే అందులో ఆమెను చేర్చారు. విచిత్రమైన విషయం ఏంటంటే... ఆ వయస్సులోను ఆమె మంచాన పడలేదు. వాంతులు అయితే స్వయంగా తనే బాత్ రూంకి వెళ్లొచ్చేది. మాత్రలు తనే వేసుకునేది. ఆమె ఆత్మవిశ్వాసం చూసి మాకు ఆశ్చర్యమేసింది అని ఆమెకు చికిత్స చేసిన వైద్యుడు  కార్ల ఫర్నో మెర్కీజ్ వ్యాఖ్యానించారు. ఆమె సులువుగా కరోనాను జయించింది. ఆమె గెలుపు కరోనా రోగులందరికీ జీవితం ఆశ - గెలవగలమన్న ఆత్మవిశ్వాసం కల్పించిందని డాక్టరు చెప్పారు.

ఇటీలీలో ఇప్పటివరకు 15887 వరకు చనిపోగా గత రెండు వారాల్లో ఇదే అతితక్కువ మరణాల రేటుగా ఉంది. అక్కడి పరిస్థితులు గమనించి ఇటలీ ఉన్నత వైద్యాధికారులు త్వరలో లాక్ డౌన్ ఎత్తేసే పరిస్తితులు వస్తాయని చెప్పారు.


Tags:    

Similar News