ఇంకో సర్వే - ఏపీలో ఫ్యాన్ తిరగడం ఖాయం

Update: 2019-04-08 16:41 GMT
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం చేపడుతుందని ప్రముఖ సంస్థ వీడీపీ అసోసియేట్స్ తన తాజా సర్వే ఫలితాలను వెల్లడించింది. అసాధారణ మెజారిటీతో వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ సర్వే పేర్కొంది. వైసీపీ సాధించిన సీట్లలో సగం కూడా  ప్రత్యర్థి పార్టీలకు రావన్న విషయం ఈ సర్వేలో తేలింది.

వీడీపీ వెల్లడించిన వివరాలను చూస్తే..  ఫ్యాన్‌ హవాతో ఏపీలో ఉన్న 175 సీట్లకు 106 నుంచి 118 సీట్లలో ఉంటుందని ఈ సర్వే లో తేలింది. ప్రస్తుతం అధికారంలో  తెలుగుదేశం పార్టీ కేవలం 68 నుంచి 54 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలిపింది. ఏకంగా హంగ్ వల్ల సీఎం సీటుపై కన్నేసిన జనసేన ఆశలు నెరవేరే అవకాశం ఏ కోశానా లేదని... ఆ పార్టీకి  ఒకటి నుంచి మూడు సీట్లు వస్తే గొప్ప అని పేర్కొంది.

ఇక పోటీలో ఉన్న ఇతర జాతీయ పార్టీలను గమనిస్తే... బీజేపీ - కాంగ్రెస్‌ - బీఎస్పీ - సీపీఐలకు ఒక్క  సీటు కూడా వచ్చే అవకాశం లేదని వీడీపీ అసోసియేట్స్ తో జనాభిప్రాయం స్పష్టమైంది. ఓటింగ్ పర్సెంటీజీ ప్రకారం చూస్తే టీడీపీ కంటే వైసీపికి నాలుగు శాతం ఎక్కువ ఓట్లు వస్తాయట. జగన్ పార్టీ వైఎస్సార్‌సీపీ 43.85 శాతం ఓట్లు సాధిస్తుందని, అదే సమయంలో టీడీపీ 40 శాతం ఓట్లు, జనసేన 9.8 శాతం ఓట్లు దక్కించుకుంటుందని సర్వే అంచనాలు చెబుతున్నాయి.



Tags:    

Similar News