అదేం దరిద్రమో.. పదో తరగతి చదివే అమ్మాయిని ప్రేమించటమే పాడు పని అనుకుంటే.. తన ప్రేమకు ఆ అమ్మాయి నో చెప్పిందని ఇంజినీరింగ్ చదివే విద్యార్థి దారుణంగా హత్య చేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. తన ప్రేమను కాదన్న ప్రేమోన్మాది.. ఆగ్రహం వ్యక్తం చేసి.. ప్రేమిస్తున్నట్లు చెప్పిన ఆ అమ్మాయి గొంతును కర్కసంగా కోసి చంపేశాడు. గురువారం జరిగిన ఈ ఉదంతంతో హైదరబాద్ శివారులోని జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తారకేశ్వరరావ్.. భవానీ దంపతులు ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చారు. ఐడీఏ బొల్లారంలోని వినాయక్ నగర్ లో అద్దెకు ఉంటున్నారు. వారి కుమార్తె నిఖిత పదో తరగతి చదువుతోంది. మరో కొడుక్కి పన్నెండేళ్లు. వీరి ఇంటి ముందే మహారాష్ట్రకు చెందిన మోహన్ కుటుంబం నివాసం ఉంటుంది. అతని కుమారుడు 23 ఏళ్ల అరవింద్ జావద్ అలియాస్ సోను నాందేడ్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.
ఎదురెదురు ఇళ్లు కావటంతో ఈ రెండుకుటుంబాలకు పరిచయం ఉంది. నిఖితను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని రెండేళ్లుగా ఆమె వెంట పడుతున్నాడు. తనతో తప్ప మరెవరితోనూ మాట్లాడకూడదని షరతులు విధించటం మొదలెట్టాడు. అయితే.. ఈ విషయాన్ని నిఖిత ఇంట్లో వారితో చెప్పలేదు.
ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం స్కూల్ నుంచి నిఖిత ఇంటికి వచ్చింది. అదే సమయంలో ఇంట్లోకి జొరబడిన అరవింద్ ఆమెను ప్రేమించాలని వేధించటం మొదలెట్టాడు. దీనికి ఆమె నో చెప్పటంతో ఆగ్రహం చెందిన అతడు.. తనతో తెచ్చిన కత్తితో మెడ మీద కోసేశాడు. నిఖిత చనిపోయిందని భావించి పారిపోతుండగా.. ఇంటి యజమాని.. స్థానికులు అతడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
తీవ్రంగా గాయపడిన నిఖితను కూకట్ పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె ప్రాణాలు వదిలింది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేమోన్మాదంతో వేధించటం ఒక ఎత్తు అయితే.. ప్రేమను ఒప్పుకోలేదని కత్తితో దారుణంగా కోసి చంపటం స్థానికంగా సంచలనం సృష్టించటమే కాదు.. అందరిని ఉలిక్కిపడేలా చేసింది.