మరో తొక్కిసలాట; గుళ్లో రద్దీ.. 12 మంది మృతి

Update: 2015-08-10 04:26 GMT
అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే వారు ఓర్పు గా సహనంగా ఉంటారనుకుంటాం. కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే ముగిసిన గోదావరి పుష్కరాల సందర్భంగా ఒకేసారి పోటెత్తిన భక్తులు.. ఒకే ఘాట్ లో పుణ్యస్నానం చేయాలన్న తపన తో తోసుకురావటం.. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి.. 27 మంది మరణానికి కారణమైంది.

శ్రావణమాసం సందర్భంగా.. జార్ఖండ్ లో నేటి ఉదయం దుర్గామాత ఆలయం లో తొక్కిసలాట చోటు చేసుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ విపరీతంగా ఉండటం.. అమ్మవారిని దర్శించుకోవాలన్న ఆతృతలో తొక్కిసలాట చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు.

గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. జార్ఖండ్ లోని దియో గఢ్ దుర్గామాత ఆలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఏది ఏమైనా అమ్మవారి దర్శనం చేసుకుంటే పుణ్యం రావాలే కానీ.. ఇలా ప్రాణాలు పోకూడదు. ఇలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు.. భక్తి పేరుతో భక్తులు తొందరపాటుకు గురి కాకుండా ఉంటే మంచిదే. అమ్మవారిని దర్శించుకుంటే వచ్చే పుణ్యం సంగతి తర్వాత.. అయిన వాళ్లను పోగొట్టుకునే కుటుంబాలు పడే నరకం అంతాఇంతా కాదన్న విషయాన్ని గుర్తించి.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News