ఈ మధ్య కాలంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా విదేశాల్లో గన్ కి విరివిగా లైసెన్స్ ఇస్తుండటం తో కాల్పుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రష్యాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కజన్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుపాకుల శబ్దం వినిపిస్తున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు మూడో అంతస్తు నుంచి దూకాడు.
అలాగే ఆ వీడియో లో ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లు కాల్పులకు పాల్పడినట్టు చెప్తుంటే , మరికొందరు మాత్రం నిందితుడు ఒకడేనని చెప్తున్నారు. స్కూల్ లో పేలుడు ఘటన లో ప్రస్తుతం 19 ఏళ్ల దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే , ఈ ఘటన వెనక ఉన్న అసలు కారణం తెలియరాలేదు. కాగా, మరో దుండగుడు పారిపోయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా పోలీస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ లో కాల్పుల ఘటనలు రష్యాలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. 2018లో చివరిసారి క్రిమియాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ కాలేజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో అప్పట్లో 19 మంది మరణించారు. టటర్‌స్థాన్ రాజధాని కజన్. ఇది రాజధాని మాస్కో కు 725 కిలోమీటర్ల దూరంలో ఉంది.