ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశారని 11 మందికి జైలుశిక్ష

Update: 2015-07-09 05:08 GMT
ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన ఇష్టారాజ్యంగా వాహనాల్ని నడిపే వారికి జరిమానాలు విధించటం తెలిసిందే. అయితే.. అందుకు భిన్నంగా దేశంలోనే తొలిసారి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాల స్థానంలో జైలుశిక్షలు విధించారు. టోలీచోకి.. సైఫాబాద్‌ పరిధిలోని 16 మంది వాహనదారులు అత్యంత ప్రమాదకరంగా వాహనాల్ని నడుపుతున్న విషయాన్ని గుర్తించి పోలీసులు కేసులు నమోదుచేశారు.

వీరికి ఎప్పటిమాదిరి చలానాలు రాయకుండా.. కేసులు పెట్టి కోర్టుకు హాజరు పర్చారు. వీరిలో 11 మందికి రెండురోజులపాటు.. ఐదుగురికి ఒకరోజు చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్ష విధించటం దేశంలోనే ఇదే తొలిసారిగా చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. సో.. వాహనాలు నడిపే సమయంలో అత్యంత అప్రమత్తతగా ఉండాలి సుమా.

Tags:    

Similar News