పెద్దన్న రాజ్యంలో తుపాకీ కాల్పులు మరోసారి భీతావాహ వాతావరణాన్ని సృష్టించాయి. తాను పని చేస్తునన భవనంలో కాల్పులకు తెగబడ్డ ఒక ఉన్మాది కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని వర్జీనియా బీచ్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.
ప్రభుత్వ భవన సముదాయం దగ్గర ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అతడ్ని మట్టు పెట్టారు. ఈ క్రమంలో ఒక పోలీసు అధికారి కూడా గాయపడ్డారు.
తాను పని చేస్తున్న చోటే ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. కాల్పులు జరిగిన ప్రభుత్వ భవనంలోనే అతడు పని చేస్తుంటాడని గుర్తించారు. కాల్పులకు అసలు కారణం ఏమిటన్న విషయంపై క్లారిటీ రాలేదు.