ఏపీలో ఒకే కుటుంబంలో 11మందికి క‌రోనా

Update: 2020-04-12 07:37 GMT
క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు ప‌ట్టి మ‌ళ్లీ విజృంభిస్తోంది. లాక్‌ డౌన్ ప‌క‌డ్బందీగా అమ‌ల‌వుతున్నా.. క‌ట్ట‌డి చ‌ర్య‌లు ముమ్మ‌రంగా తీసుకుంటున్నా వైర‌స్ మాత్రం విస్త‌రిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 405కు చేరింది. శనివారం ఒక్కరోజే 24 కొత్త కేసులు నమోదవ‌డం ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న రేపుతోంది. ఈక్ర‌మంలో గుంటూరులో 17 - కర్నూలులో 5 - ప్రకాశం - వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. కొత్తగా వైరస్‌ సోకిన వారిలో 17మంది గుంటూరు నగరానికి చెందినవారే. అయితే వారిలో ఏకంగా 11 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావ‌డం విశేషం. వీరిలో పదేళ్లలోపు చిన్నారులు ఆరుగురు ఉండ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఇదే కుటుంబంలో ఇద్దరు మహిళలకు కూడా ఈ వ్యాధి సోకింది.

గుంటూరు నగరంలో రెడ్‌ జోన్‌ ప్రాంతంగా గుర్తించారు. ఒక వీధిలో ఇప్పటికే 22 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. గుంటూరులోని వేర్వేరు ప్రాంతాల్లో మరో ఆరుగురికి కూడా వైరస్‌ సోకింది. ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 75కు పెరిగడంతో గుంటూరు జిల్లాలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా లాక్‌ డౌన్‌ ను ప‌క్కాగా అమ‌లుచేసేందుకు అధికార యంత్రాంగం ప‌క్కాగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల్లో కంటెన్‌మెంట్ జోన్‌ లుగా - రెడ్ జోన్‌ లుగా ప్ర‌కటించారు. ఆయా ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఈ జిల్లాలో క‌రోనా మ‌ర‌ణాలు రెండు సంభ‌వించాయి. దాచేపల్లికి చెందిన ఓ వ్యక్తి గుంటూరులోని జీజీహెచ్‌ లో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ గా తేలింది.  క‌రోనా కేసుల విష‌యంలో గుంటూరు - కర్నూలు జిల్లాలు పోటీ ప‌డుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనే అత్య‌ధికంగా 82 కేసులు క‌ర్నూలు జిల్లాలో న‌మోద‌య్యాయి. శ‌నివారం మరో ఐదు పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. వారంతా ఢిల్లీ వెళ్లి వచ్చినవారితో సంబంధం ఉన్నవారే.


Tags:    

Similar News