ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం వినిపిస్తూనే ఉంది. ఈ మహమ్మారిని ఆపడం అగ్రరాజ్యం అమెరికా వల్ల కూడా కావడం లేదు. దాదాపు 210 దేశాలకు కరోనా విస్తరించింది. దీంతో అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,14,200 మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య 18.50 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేల మంది మృతిచెందారు.
*అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం అమెరికాలో మృతుల సంఖ్య 22వేలు దాటింది. బాధితుల సంఖ్య 5.6 లక్షలు దాటింది. అమెరికాలో కరోనా బారిన పడిన ప్రతి 10 మంది మధ్య వయస్కుల్లో ఒకరు మృతిచెందుతున్నారని తెలిసింది. 85ఏళ్లు పైబడిన వారిలో 10మందిలో ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది.
*రష్యా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 2186 కేసులు నమోదయ్యాయి. రష్యాలో బాధితుల సంఖ్య 15770కి చేరింది. రష్యాలో కరోనా కారణంగా 130మంది మరణించారు.
*స్పెయిన్ లో ఒక్కరోజే 619మంది మరణించారు. మొత్తం రోగుల సంఖ్య 166831కు పెరిగింది.
*ఇటలీలో 24 గంటల్లో 600 మందికి పైగా మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 156363కి చేరింది.
*ఫ్రాన్స్ లో 1.32 లక్షలు, జర్మనీలో 1.27 లక్షలు, బ్రిటన్ 84వేలు, చైనాలో 82వేలు, ఇరాన్ 71వేలు, టర్కీలో 56వేలు, బెల్జియంలో 29వేలు, నెదర్లాండ్ లో 25వేలు, స్విట్జర్లాండ్ లో 25వేలు, కెనడాలో 24వేలు, బ్రెజిల్ లో 22వేలు, పోర్చుగల్ లో 16వేలు, ఇజ్రాయిల్ లో 11వేలు, దక్షిణ కొరియాలో 10వేల వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి గల్ఫ్ దేశాల్లోనూ తీవ్రంగా ఉంది.
*భారతదేశంలో
భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఉదయం వరకు అందిన సమాచారం ప్రకారం దేశంలో 9152 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా 308మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకొని 765మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపింది.
*తెలంగాణలో పెరుగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయానికి 531 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 16మంది చనిపోయారు. 103 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
*ఆంధ్రాలోనూ పెరుగుదలే..
ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. సోమవారం ఉదయం వరకు 420 కేసులు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు. 12 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.