అల్ల‌రిమూక‌ల నిర్వాకం..క‌రోనా బారిన 119 మంది పోలీసులు?

Update: 2020-04-26 04:20 GMT
భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్రంగా ప్ర‌బ‌ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం త‌బ్లిగీ జ‌మాత్ సభ్యులే కార‌ణమ‌ని అంద‌రికీ తెలిసిందే. దేశంలో ఇంత అల్ల‌క‌ల్లోలానికి కార‌ణమైన ఆ స‌భ్యులు ఇప్పుడు తాజాగా క‌ర్నాట‌క‌లో క‌ల‌క‌లం రేపారు. వారివ‌ల‌న ఇప్పుడు 186 మంది పోలీసుల‌తో పాటు వారి కుటుంబ‌స‌భ్యులు ప్ర‌మాదంలో పడ్డారు. వారు చేసిన నిర్వాకానికి ఇప్పుడు క‌ర్నాట‌క‌లో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా మారాయి. క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగళూరులోని పాదరాయనపురకు చెందిన 119మంది ఢిల్లీలో జ‌రిగిన త‌బ్లిగీ జ‌మాత్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లివ‌చ్చారు. ఆ స‌మ‌యంలోనే దేశంలో ఆ ప్రార్థ‌న‌ల ద్వారా పెద్ద సంఖ్య‌లో క‌రోనా వైర‌స్ పాకింద‌ని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించ‌డంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

ఈ క్ర‌మంలో పాదరాయనపురలో 119 మందిని అదుపులోకి తీసుకోవ‌డాడానికి 186 మంది పోలీసులు ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి వెళ్లారు. అప్పుడే సీల్ డౌన్ చేశారు. ఇందులో భాగంగా కరోనా వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలనే ఉద్దేశంతో ఆదివారం రాత్రి ఆ ప్రాంతానికి వైద్య సిబ్బంది - పోలీసులు - ఆశా వర్కర్లు వెళ్లారు. అయితే ఆ సమయంలో అక్క‌డి అల్లరిమూకలు - కరోనా వ్యాధి సోకిన వారు - వారి కుటుంబ‌స‌భ్యులు - బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు - ఆశా వర్కర్లు - వైద్య సిబ్బంది మీద దాడులు చేసి బీభ‌త్సం సృష్టించారు. ఈ సంద‌ర్భంగా బారికేడ్లు ధ్వంసం చేసి పోలీసులను ప‌రుగెత్తించారు.

అయితే 119 మందిని అదుపులోకి తీసుకోవ‌డానికి పాదరాయనపురకు వెళ్లిన స‌మ‌యంలో దాడుల‌కు పాల్ప‌డినా.. వైద్య సిబ్బంది - పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో118 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదు మందికి కరోనా పాజిటివ్ అని వెలుగుచూసింది. ఈ కేసులు రావ‌డంతో పాదరాయనపురకు వెళ్లిన పోలీసులు ఖంగు తిన్నారు. వెంట‌నే ప్ర‌భుత్వం స్పందించి పాద‌రాయ‌న‌పుర‌కు వెళ్లిన 186 మంది పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ‌స‌భ్యుల‌ను అంద‌రినీ క్వారంటైన్‌ లో ఉంచారు.

పాదరాయనపురలో అల్లరిమూకలను అరెస్టు చేసిన బెంగళూరు సెంట్రల్, పశ్చిమ విభాగం పోలీసులు ఇప్పుడు కరోనా సోకుతుంద‌ని భ‌యాందోళ‌న చెందుతున్నారు.  పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా వైద్య పరీక్షలు చేసిన అధికారులు వారిని హోమ్ క్వారంటైన్ కు తరలించారు.

పాదరాయనపురలో అల్లరిమూకలను అరెస్టు చేసి బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేస్తున్నారు. దాడులు చేసిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. బెంగళూరులోని చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలోకి త‌ర‌లించారు. విచార‌ణ అనంత‌రం ఆ నిందితులను ఆడుగోడిలోని మంగళ కల్యాణ మండపంలోని కరోనా క్వారంటైన్‌కు తరలించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎలా ఉన్నాపోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ‌స‌భ్యులు త‌మ‌కు ఎక్క‌డ క‌రోనా వైర‌స్ సోకి ఉంటుందేమోన‌ని భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఒక‌రు చేసిన త‌ప్పి దానికి వేరేవారు బ‌ల‌వ‌డం యాదృచ్చిక‌మే.



Tags:    

Similar News