ఏపీలో తీవ్ర సంచలనం రేపిన నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. నారాయణరెడ్డిని అత్యంత దారుణంగా చంపేసిన నిందితుల్లో 12 మందిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని విచారించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డిని తాము ఎందుకు హత్య చేశామన్న విషయాన్ని నిందితులు వెల్లడించినట్లుగా పోలీసులు చెప్పారు.
చెరుకులపాడు గ్రామానికి చంఎదిన పెద్ద బీసన్న కుమారుడు రామాంజనేయులు.. కోతుల రామానాయులను చంపుతామని నారాయణరెడ్డి మనుషులు బెదిరించటంతోనే నారాయణరెడ్డిని.. ఆయన అనుచరుడు బోయ సాంబశివుడులను ప్రత్యర్థులు హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ హత్యకు ఉపయోగించిన రెండు ట్రాక్టర్లు.. వేటకొడవళ్లను స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. నిందితుల్ని జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. డీఐజీ రమణకుమార్..ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. అనంతరం నిందితుల్ని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటివరకూ ఎఫ్ ఐఆర్ లో లేని మరో ఐదు పేర్లు కూడా విచారణలో బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. కేసు విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మిగిలిన నిందితుల్ని అదుపులోకి తీసుకోనున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/