రేవంత్‌కు 12 గంట‌ల బెయిల్

Update: 2015-06-10 10:44 GMT
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి.. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి 12 గంట‌ల పాటు బెయిల్ ల‌భించింది. కుమార్తె నిశ్చితార్థం సంద‌ర్భంగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీక‌రించింది.
రేవంత్‌కు బెయిల్ పిటీష‌న్ మీద భారీగానే వాద‌న‌లు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో రేవంత్‌కు బెయిల్  ఇస్తే.. సాక్ష్యాలు మార్చే అవ‌కాశం ఉంద‌ని వాదించారు. మ‌రోవైపు. .రేవంత్ త‌ర‌ఫు లాయ‌ర్లు కుమార్తె నిశ్చితార్థం సంద‌ర్భంగా రెండు రోజులు బెయిల్ ఇవ్వాలంటూ అభ్య‌ర్థించారు.
ఈ సంద‌ర్భంగా నిశ్చితార్థ ఆహ్వాన లేఖ‌ల్ని జ‌త చేశారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ త‌ర‌ఫు లాయ‌ర్లు సుదీర్ఘంగా వాదించారు. అదే సమ‌యంలో ప‌రిమిత కాలానికి సంబంధించి రేవంత్‌కు బెయిల్ ఇవ్వ‌టానికి అభ్యంత‌రం లేద‌ని.. ఒక రోజు బెయిల్ ఇవ్వ‌టంపై తాము అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టం లేద‌ని ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ పేర్కొన్నారు. తాము స‌మాజంలో ఉన్నామ‌ని.. ఇంట్లో శుభ‌కార్యం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వ‌టం అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌మ‌న్నారు.

ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3.45గంట‌ల ప్రాంతంలో ష‌రతుల‌తో కూడిన బెయిల్ ఇచ్చారు. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ సైతం ఒక రోజు బెయిల్‌కు అభ్యంత‌రం లేద‌న్న‌ప్ప‌టికీ కేవ‌లం ప‌న్నెండుగంట‌ల స‌మ‌యాన్ని మాత్ర‌మే రేవంత్ కు ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ నాయ‌కుల్ని.. మీడియా ప్ర‌తినిధుల్ని రేవంత్ క‌ల‌వ‌కూడ‌దంటూ మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేశారు. గురువారం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి.. సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే బెయిల్ మంజూరు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మొత్తానికి రేవంత్ బెయిల్ మంజూరు కావ‌టంతో ఆయ‌న కుమార్తె నిశ్చితార్థానికి పాల్గొనే అవ‌కాశం ద‌క్కిన‌ట్ల‌యింది.
Tags:    

Similar News