వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ అత్యాచారం - హత్య ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న తరుణంలోనే జార్ఖండ్ లో అదే తరహా దారుణం జరిగింది. .కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో మూడు రోజుల కిందట జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 26వ తేదీన ఉదయం 5:30 గంటల సమయంలో ఓ ఎల్ ఎల్ బీ స్టూడెంట్..తన ఫ్రెండ్ తో కలిసి ఉంది. అదే సమయంలో అక్కడకు బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు గన్ పాయింట్ లో బెదిరించి ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
రాంఛీ (రూరల్)ఎస్పీ రిషబ్ ఝా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేశారు. 12 మంది నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఫ్రెండ్ తో కలిసి బైక్‌పై వెళుతున్న బాధితురాలిని రెండు బైక్ లపై వచ్చిన వ్యక్తులు గన్ తో బెదిరించి బలవంతంగా లాక్కెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక ఆ అగంతకులు తమ స్నేహితులకు ఫోన్ చేయడంతో మరికొందరు కారులో వచ్చారు. అందులో ఆమెను బ్రిక్ కిల్న్ అనే ఏరియాకు తీసుకెళ్లి అక్కడే ఆమెపై 12 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన తర్వాతి రోజు.. స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా సమగ్ర దర్యాప్తు చేశామని వివరించారు. నిందితుల నుంచి కారు - బైక్ - పిస్టల్ - ఎనిమిది మొబైల్ ఫోన్లు - బాధితురాలి నుంచి లాక్కున్న ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పోలీసులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.