మోదీ కేబినెట్ లో 60 మంది... కొత్త ముఖాలు 12?

Update: 2019-05-30 11:42 GMT
ప్రధానిగా నరేంద్ర మోదీ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో మరికాసేపట్లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధానిగా నరేంద్ర మోదీతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించనున్నారు. ప్రదానిగా రెండో మారు ప్రమాణం చేయనున్న మోదీ... తన కేబినెట్ మంత్రులతో కూడా ప్రమాణం చేయించనున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి సుదీర్ఘ మంతనాలు సాగించిన మోదీ... తన కేబినెట్ కు తుది రూపు ఇచ్చినట్లుగానూ ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోదీ కేబినెట్ లో మొత్తం 60 మందికి చోటు దక్కనున్నట్లుగా తెలుస్తోంది. ఆ జాబితా ఇదేనంటూ ఓ జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ 60 మందిలో కొత్త ముఖాలు ఎన్ని ఉంటాయన్న విషయం కూడా ఆ జాబితాలో ఉంది. 60 మంది కలిగిన ఈ కేబినెట్ లో 12 మంది కొత్త ముఖాలకు కూడా చోటు దక్కనుందన్న వార్తలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ జాబితా ప్రకారం మోదీ కేబినెట్ లో చేరే కొత్త ముఖాలు ఎవరన్న విషయానికి వస్తే.... తెలుగు నేల నుంచి జి.కిషన్ రెడ్డితో పాటు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ - తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాధ్ - సురేశ్ అంగాడి - ప్రహ్లాద్ పటేల్ - కిషన్ పాల్ గుజ్జర్ - కైలాశ్ చౌదరి - రాజేంద్ర ప్రసాద్ సింగ్ - నిత్యానంద రాయ్ - దేబాశీష్ చౌదరి - రామేశ్వర్ తెలి - హరిసిమ్రత్ కౌర్ బాదల్ - సోం ప్రకాశ్ - అర్జున్ ముండా తదితరులున్నారు. ఇక మిగిలిన వారిలో మెజారిటీ నేతలంతా ఇదివరకు మోదీ కేబినెట్ లో ఉన్నవారేనన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా 60 మంది సభ్యులతో తన కేబినెట్ ను ఏర్పాటు చేయనున్న మోదీ... ఏకంగా 20 శాతం మంది కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారన్న మాట.


Tags:    

Similar News